Acharya Movie: రాధాకృష్ణలుగా మారిన పూజా హెగ్డే, రామ్‌ చరణ్‌.. ఆకట్టుకుంటోన్న ఆచార్య కొత్త పోస్టర్‌..

Acharya Movie: చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఆచార్య. అపజయం అంటూ ఎరగని దర్శకుడు కొరటాల శివ సినిమా దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే..

Acharya Movie: రాధాకృష్ణలుగా మారిన పూజా హెగ్డే, రామ్‌ చరణ్‌.. ఆకట్టుకుంటోన్న ఆచార్య కొత్త పోస్టర్‌..
Acharya Movie Update

Updated on: Nov 02, 2021 | 12:45 PM

Acharya Movie: చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఆచార్య. అపజయం అంటూ ఎరగని దర్శకుడు కొరటాల శివ సినిమా దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చిత్ర షూటింగ్‌ కూడా వాయిదా పడడంతో దసరా నుంచి సంక్రాంతికి వాయిదా వేశారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్‌ ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ నటిస్తోన్న విషయం విధితమే.

ఇదిలా ఉంటే ఇందులో రామ్‌ చరణ్‌ కూడా నటిస్తున్నారు. గతంలో తండ్రితనయులు ఇద్దరు అడపాదడపా పలు చిత్రాల్లో కలిసి నటించినా ఇలా పూర్తి స్థాయిలో కనిపిస్తుండడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇందులో చెర్రీ సరసన అందాల భామ పూజాహెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డేల మధ్య చిత్రీకరించిన నీలాంబరి అనే పాటను విడుదల చేయనున్నారు.

పూజా, చెర్రీలకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలిపింది. ఇందులో పూజా చేతిలో పిల్లనగ్రోవి పట్టుకోగా, చెర్రీ వెనకాల నుంచి పూజాను హద్దుకున్న ఫోటో రొమాంటిక్‌గా ఉంది. ఇక ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పూజా.. ‘ఈ పాటలోని సన్నివేశాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. మణిశర్మ నుంచి ఇది మరో అద్భుమైన మెలోడీ పాట కానుంది. నవంబర్‌ 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఆచార్య సెకండ్ సింగిల్‌ నీలాంబరి విడుదల కానుంది’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

Also Read: Festival Season Effect: అక్టోబర్‌లో ఫాస్టాగ్‌ వసూళ్లు ఎంత పెరిగాయంటే..

Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..

Flying Bike: ప్రపంచంలో మొట్టమొదటి గాల్లో ఎగిరే బైక్‌..! వీడియో