Bigg Boss Season 6: బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్‌లో తొలి అంకానికి ముహూర్తం ఖరారైంది. విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆదివారం తొలి కంటెస్టెంట్ హౌజ్ నుంచి వెళ్లిపోనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఇనయా సుల్తానా, అభినయశ్రీ, ఫైమా, శ్రీ సత్య, ఆరోహి రావు, చలాకీ చంటి, సింగర్ రేవంత్ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌హౌజ్ నుంచి ఎలిమిటేన్ అయ్యే తొలి కంటెస్టెంట్ అభినయ శ్రీని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈవారం ఇంటి నుంచి వెళ్లిపోయేది పక్కాగా ఆమెనేననే చర్చ తెరపైకి వచ్చింది.
అయితే ఎపిసోడ్ టెలికాస్ట్‌కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో మరో కొత్త వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రకారం.. అసలు ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేకుండానే ఆదివారం ఎపిసోడ్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే చివరి వరకు ఈ సస్పెన్స్‌ను కొనసాగిస్తూనే ఎపిసోడ్ రన్ అవుతుందని తెలుస్తోంది. మొత్తం ఏడుగురు ఇంటి సభ్యుల్లో చివరి వరకు అభినయశ్రీ, ఇనయా సుల్తానాను తీసుకొచ్చి లాస్ట్‌కి ఈ వారం ఇద్దరూ సేఫ్, ఎలిమినేషన్ లేదని నాగ్ ప్రకటించారని వార్తలు వస్తున్నాయి.
మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ లీక్స్‌లో ఏమేర నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూస్తే సరి. ఇక బిగ్‌బాస్ యాజమాన్యం ఆదివారం విడుదల చేసిన వీకెండ్ ప్రోమోలు చూస్తుంటే ఈరోజు వీక్షకులకు ఫన్ మాత్రం పక్కా అని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..