Kalki: ఓటీటీలోకి కల్కి వచ్చేది అప్పుడేనా.? వైరల్‌ అవుతోన్న ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..

|

Aug 01, 2024 | 7:54 AM

ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి' చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ అశ్విన్‌ అద్భుమైన విజన్‌తో పాటు ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌ హాసన్‌ నటన ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది...

Kalki: ఓటీటీలోకి కల్కి వచ్చేది అప్పుడేనా.? వైరల్‌ అవుతోన్న ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..
Kalki Movie
Follow us on

ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’ చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ అశ్విన్‌ అద్భుమైన విజన్‌తో పాటు ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌ హాసన్‌ నటన ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాయి. ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. రికార్డు కలెక్షన్లను రాబట్టి ఊహకందని విజయాన్ని నమోదు చేసుకుంది.

ఏకంగా రూ. 1200 కోట్లకుపైగా కొల్లగొట్టిందీ మూవీ. ఇక ఓవర్‌సీస్‌ మార్కెట్లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జూన్‌ 27వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటుతోంది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ సినిమా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఇక థియేటర్లలో విడుదలై నెల రోజులు గడుస్తోన్న నేపథ్యంలో కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

థియేటర్లలో చూడని వారు, మరోసారి కల్కిని వీక్షించాలని ఆశపడుతున్న వారు ఓటీటీ విడుదల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి విడుదలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే మేకర్స్‌ కల్కి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి తేదీని ఫైనల్ చసినట్లు తెలుస్తోంది. కల్కి మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. 8 వారాల గడువు తర్వాత కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ లెక్కన ఆగస్టు 23న కల్కి ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే ఇండిపెండెన్స్‌ డే కానుకగా కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..