Mahesh Babu: మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్న మహేష్‌ బాబు.. ఈసారి మెగా ప్రొడ్యుసర్‌తో చేతులు కలపనున్న ప్రిన్స్‌..

Mahesh Babu: భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాలతో మహేష్‌ బాబు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలను నమోదు..

Mahesh Babu: మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్న మహేష్‌ బాబు.. ఈసారి మెగా ప్రొడ్యుసర్‌తో చేతులు కలపనున్న ప్రిన్స్‌..
Mahesh Babu
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 19, 2021 | 7:57 AM

Mahesh Babu: భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాలతో మహేష్‌ బాబు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో మహేష్‌ బాబు తదుపరి చిత్రంపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను అందుకునే క్రమంలోనే మహేష్‌ ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించని మహేష్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే రాజమౌళి, త్రివిక్రమ్‌లతో సినిమాలు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు ఇంకా పూర్తికాకముందే మహేష్‌ బాబు మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు మెగా ప్రొడ్యుసర్‌ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజానికి ఈ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చర్చ జరుగుతున్న వేళ.. మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.  ఇదిలా ఉంటే సర్కారు వారి పాట షూటింగ్ నవంబర్ లో పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Google Analytics: వెబ్‌సైట్లకు జీరో యూజర్లు.. గందరగోళంలో సైట్‌ ఓనర్స్‌. అసలేం జరిగిందంటే..

Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు..

SBI Travel Card: ఎస్‌బిఐ అదిరిపోయే ఆఫర్.. ట్రావెల్‌ కార్డ్‌‌తో క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా..!