DJ Tillu: చిన్ని సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది డీజే టిల్లు చిత్రం. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. సిద్దు జొన్నలగడ్డ మార్క్ యాక్టింగ్‌తో సినిమాను విజయతీరాలకు చేర్చాడు. ఇక విమల్ కృష్ణ దర్శకత్వం సైతం సినిమాకు పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా సిద్దు డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘అట్లుంటది మనతోని’ అంటూ తెలంగాణ యాసలో సిద్దు పలికిన సంభాషణలను సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. తొలిపార్ట్‌లో తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నేహా శెట్టి సీక్వెల్‌లో నటించడం లేదనేది సదరు వార్త సారంశం. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సీక్వెల్‌లో నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక 2022 ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్లు రాబట్టి కథలో మ్యాటర్ ఉండాలే కానీ చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేదని చాటి చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..