Mrunal Thakur: టాలీవుడ్‌లో ‘సీతా మహాలక్ష్మీ’ బిజీ బిజీ.. మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.

|

Feb 12, 2023 | 2:41 PM

సీతా రామమ్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార మృణాల్‌ ఠాకూర్‌. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ బ్యూటీ. సినిమా మొత్తం చీర కట్టు, క్యూట్‌ నటనతో మెప్పించింది. తెలుగులో గ్లామర్‌కు పూర్తిగా దూరంగా ఉన్న మృణాల్‌ బాలీవుడ్‌లో మాత్రం గ్లామర్‌ డోస్‌ను..

Mrunal Thakur: టాలీవుడ్‌లో సీతా మహాలక్ష్మీ బిజీ బిజీ.. మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌.
Mrunal Thakur
Follow us on

సీతా రామమ్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార మృణాల్‌ ఠాకూర్‌. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ బ్యూటీ. సినిమా మొత్తం చీర కట్టు, క్యూట్‌ నటనతో మెప్పించింది. తెలుగులో గ్లామర్‌కు పూర్తిగా దూరంగా ఉన్న మృణాల్‌ బాలీవుడ్‌లో మాత్రం గ్లామర్‌ డోస్‌ను పెంచేసింది. ఈ బ్యూటీ బాలీవుడ్‌ అక్షయ్‌ కుమార్‌తో జోడిగా ఓ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ‘కుడియే నే తెరి..’ సాంగ్‌లో గ్లామర్‌ డోస్‌ను పెంచేసింది.

ఇదిలా ఉంటే తెలుగులో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలకు మాత్రం పెద్దగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదనే చెప్పాలి. సీతారామమ్‌ తర్వాత వరుసగా హిందీ సినిమాలకు సైన్‌ చేసింది. ఏకంగా 5 హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే తాజాగా తెలుగులో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాని 30 చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మృణాల్‌ మరో తెలుగు సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇటీవల ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మృణల్‌ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. నాని 30 మూవీతో పాటు మరో తెలుగు సినిమాని కూడా లైన్‌లో పెట్టినట్లు మృణల్‌ తెలిపింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రటకన మాత్రం రాలేదు. దీంతో మృణాల్‌ తర్వాతి తెలుగు చిత్రం ఎవరితో అన్న దానిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి అందాల సీత నెక్ట్స్‌ తెలుగు మూవీ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే. ఇదిలా ఉంటే మృణాల్‌ ఠాకూర్‌ త‌మిళంలో సూర్య హీరోగా శివ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సినిమాలోనూ నటిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..