కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్ నీల్ అద్భుత దర్శకత్వం హీరోయిజాన్ని ఎలివేట చూపించే విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిది. ఈ సినిమా అనంతరం వచ్చిన కేజీఎఫ్2తో పాటు, సలార్ చిత్రాలు సైతం భారీ విసయాన్ని అందుకున్నాయి.
దీంతో ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమాలపై ఆకాశన్నంటే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న వార్త ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31వ చిత్రం తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్న వియషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే అటు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఈనెల 9వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే చిత్ర యూనిట్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండంతో ఫ్యాన్సీ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..