Laal Singh Chaddha: ‘గత 48 గంటల నుంచి నేను నిద్రపోలేదు.. అప్పుడే నాకు ప్రశాంతత’: అమీర్‌ఖాన్‌

|

Aug 11, 2022 | 7:17 AM

అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మువీ 'లాల్‌ సింగ్‌ చడ్డా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్‌ఖాన్‌ మంగళవారం (ఆగస్టు 9) హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు..

Laal Singh Chaddha: గత 48 గంటల నుంచి నేను నిద్రపోలేదు.. అప్పుడే నాకు ప్రశాంతత: అమీర్‌ఖాన్‌
Aamir Khan
Follow us on

Laal Singh Chaddha movie release date: అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మువీ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్‌ఖాన్‌ మంగళవారం (ఆగస్టు 9) హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొత్త మువీ రిలీజ్‌ సందర్భంగా గత 48 గంటల నుంచి అసలు నిద్రపోవట్లేదని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు. 1994 నాటి హాలీవుడ్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’ మువీకి రీమేక్‌గా రూపొందించిన ‘లాల్‌ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) ఈ రోజు (ఆగస్టు 11) ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ తర్వాత దాదాపు నాలుగేళ్ల తర్వాత విడుదల కానున్న మువీ కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మాత్రం తన ఆశలన్నీ కొత్త సినిమాపైనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘లాల్‌సింగ్‌ చడ్డా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచి నేను నిద్రపోవట్లేదు. నా మెదడు ఓవర్‌డ్రైవ్‌లో ఉంది. నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ఆన్‌లైన్‌లో చెస్‌ ఆడటం, పుస్తకాలు చదవడం చేస్తున్నాను. ఆగస్టు 11 తర్వాత మాత్రమే ప్రశాంతంగా నిద్రపోగలనని అనుకుంటున్నట్లు అమీర్‌ తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని గురించి వివరించాడు.

రచయిత అతుల్ కులకర్ణి రాసిన కథ ‘లాల్ సింగ్ చద్దా’ మువీలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షారుఖ్‌ ఖాన్‌ ఈ మువీలో అతిధి పాథ్రలో నటిస్తున్నారు. కాగా గతవారం లాల్‌ సింగ్‌ చద్దా సినిమా బహిష్కరించాలనే డిమాండ్‌తో సోషల్‌ మీడియాలో #BoycottLaalSinghChaddha హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

దీనిపై అమీర్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ‘నా సినిమా చూడకూడదనుకుంటున్నవారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకెప్పుడూ లేదు. ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నాను. సినిమా బహిష్కరణ పిలుపు పట్ల ఎంతో బాధపడ్డాను. మువీ నా ఒక్కడిది మాత్రమే కాదు. అది ఎంతో మంది నటీ నటుల సమిష్టి కృషితో రూపొందింది. ఎక్కువ మంది ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థియేటర్‌లో అందరితో కలిసి సినిమా చూడటం వల్ల కలిగే ఆనందానికి ఏదీ సరిపోదని’ అమీర్‌ఖాన్‌ భావోద్వేగంతో తెలిపారు.