AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman Shetty: సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ రూం.. ఫోటో పెట్టి రోజూ.. ఎందుకంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్ శెట్టి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో, కామెడీ టైమింగ్ లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సుమన్ శెట్టి బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

Suman Shetty: సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ రూం.. ఫోటో పెట్టి రోజూ.. ఎందుకంటే..
Suman Shetty
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2026 | 12:38 PM

Share

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సుమన్ సెట్టి. జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీతోనే తన నటనతో ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో అధ్యక్షా అనే డైలాగ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్ 9తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈషోలో తన అమాయకత్వం, మంచితనంతో మరోసారి అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. ఇదెలా ఉంటే సుమన్ శెట్టి కెరీర్ తొలినాళ్లలోనే డైరెక్టర్ సలహా మేరకు భూమి కొని, ఇల్లు కట్టుకున్నారట. తన ఇంట్లో ఒక గదిని ఆయన కోసం ప్రత్యేకంగా కేటాయించి, ఇప్పటికీ అందులో ఆయన ఫోటో పెట్టి శుభ్రంగా చూసుకుంటున్నారు. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ తేజ.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

దర్శకుడు తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో సుమన్ శెట్టికి ఒక మంచి సలహా ఇచ్చారు. సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత మొదట ఒక స్థలాన్ని కొనుక్కొని, ఇల్లు కట్టుకోవాలని తేజ సూచించారు. తేజ గారి సలహా మేరకు సుమన్ శెట్టి ఒక స్థలం కొని, అందులో ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ విజయానికి తేజనే కారణమని నమ్మిన సుమన్ శెట్టి, ఒకరోజు తేజ గారిని కలిసి, తన కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

“సార్, నేను మీకు ఏ విధంగా రుణపడి ఉంటాను?” అని సుమన్ శెట్టి అడగగా, తేజ ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేశారు. కొత్త నటులు, సాంకేతిక నిపుణులతో సినిమాలు తీసే అలవాటు తనకు ఉందని, భవిష్యత్తులో తాను రోడ్డున పడితే ఉండటానికి చోటు ఉండదని తేజ సరదాగా అన్నారు. అందువల్ల, సుమన్ శెట్టి కట్టుకుంటున్న ఇంట్లో ఒక గదిని తన కోసం కేటాయించాలని కోరారు. సుమన్ శెట్టి తేజ గారి మాటను గౌరవించి, ఆ గదిని నిర్మించి, ఇప్పటికీ తేజ ఫోటోతో శుభ్రంగా ఉంచుతున్నాడు. ఇది సుమన్ శెట్టికి తేజపై ఉన్న అంతులేని కృతజ్ఞతకు, వారిద్దరి మధ్య ఉన్న విలువల బంధానికి అద్దం పడుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us