AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల అదుపులో లేడీ డాన్‌.. ఈమె స్టోరీ తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

పోలీసుల అదుపులో లేడీ డాన్‌.. ఈమె స్టోరీ తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

Samatha J
|

Updated on: Sep 08, 2026 | 11:37 AM

Share

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో లేడీ డాన్గా కుట్రలు పన్నుతూ ప్రజల ఆస్తులను అక్రమంగా కాజేసిన కోనేటి సులోచనను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పులు ఇస్తానని నమ్మించి, ఆపై బెదిరించి బాధితుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. సోదాల్లో కీలక పత్రాలు, ఖాళీ బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. సులోచనపై ఇప్పటికే 14 కేసులు నమోదయ్యాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో లేడీ డాన్గా పేరుపొందిన కోనేటి సులోచనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పులు ఇస్తానని నమ్మించి, ఆపై బెదిరింపులకు పాల్పడి బాధితుల ఆస్తులను అక్రమంగా కాజేశారనే ఆరోపణలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు అనుమతితో సులోచన నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్లతో పాటు ప్రాంసరీ నోట్లు, ఖాళీ బాండ్లు, స్టాంప్ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు డీఎస్పీ బుచ్చి రాజు వెల్లడించారు. సులోచనపై మోసం, ఫోర్జరీ పత్రాలతో అక్రమాలు వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే మదనపల్లిలోని వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లలో ఆమెపై మొత్తం 14 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఆమెపై రౌడీ షీట్ కూడా తెరిచారు. స్థానికంగా పలు రాజకీయ పార్టీలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?

Follow Us