Viral News: పీక్స్‌కి చేరిన పుష్ప ఫీవర్‌.. పదో తరగతి విద్యార్థి ఆన్సర్‌ పేపర్‌ చూసి కంగుతిన్న ఉపాధ్యాయుడు..

|

Apr 07, 2022 | 7:07 AM

Viral News: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa) సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా..

Viral News: పీక్స్‌కి చేరిన పుష్ప ఫీవర్‌.. పదో తరగతి విద్యార్థి ఆన్సర్‌ పేపర్‌ చూసి కంగుతిన్న ఉపాధ్యాయుడు..
Pushpa Viral
Follow us on

Viral News: అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa) సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందీ సినిమా. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం, డైలాగ్‌లకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే.. పుష్ప క్రేజ్‌ ఏకంగా ఖండాంతరాలు దాటేసింది. విదేశీ క్రికెటర్లు సైతం తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి కూడా మాములుగా లేదు.

పుష్ప విడుదలై దాదాపు 4 నెలలు గడుస్తోన్నా ఇప్పటికీ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. సినిమాలోని డైలాగ్స్‌, పాటలకు సంబంధించిన రీల్స్‌ నెట్టింట మారుమోగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పదో తరగతి కుర్రాడు చేసిన పని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థి ఆన్సర్‌ పేపర్‌లో ఏకంగా పుష్ప డైలాగ్‌ను రాసేశాడు. సమాధానాలకు బదులుగా పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌ను పోలుస్తూ.. ‘పుష్ప, పుష్ప రాజ్‌.. పరీక్ష రాసేదేలే’ అంటూ రాసేశాడు.

దీంతో ఇది చూసిన ఉపాధ్యాయుడు ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పుష్ప మేనియాకు ఇది నిదర్శనమని కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం పరీక్షా పత్రంలో ఇలా రాయడం తప్పని వాదిస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప తొలి పార్ట్‌తోనే ఇలాంటి క్రేజ్‌ను సృష్టిస్తే ఇక ‘పుష్ప రైజ్‌’తో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: PM Modi-Sharad Pawar: గడ్కరీతో విందు.. ప్రధాని మోడీతో భేటీ.. మహా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’

Pudding Pub: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు.. నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు.. కీలక విషయాలు