Pudding Pub: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు.. నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు.. కీలక విషయాలు
సంచలనం రేకేత్తించిన బంజారాహిల్స్(Banjara hills) రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నాంపల్లి కోర్టు(Nampalli Court)లో రిమాండ్ రిపోర్టు దాఖలైంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ నిర్వాహకులు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో....
సంచలనం రేకేత్తించిన బంజారాహిల్స్(Banjara hills) రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నాంపల్లి కోర్టు(Nampalli Court)లో రిమాండ్ రిపోర్టు దాఖలైంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ నిర్వాహకులు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ లు పబ్‌లో రోజూ తెల్లవారుజామున 4 గంటల వరకు మద్యం, మాదక ద్రవ్యాలు(Drugs) విక్రయిస్తున్నట్టు తెలిపారు. ముందస్తు సమాచారం, ప్రణాళికతో మూడో తేదీ తెల్లవారుజామున పబ్‌పై పోలీసులు దాడి చేశారు. ట్రేలలో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్‌ను గమనించారు. అదే ట్రేలో ఉన్న ప్యాకెట్లలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్, ప్రింటర్, వేయింగ్ మిషన్‌తో పాటు ప్యాకింగ్ మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పబ్ మేనేజర్ అనిల్ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుసుకొని అతణ్ని ప్రశ్నించారు. పబ్‌లో కిరణ్‌రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి పోలీసులు వాళ్లపైనా కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పుడింగ్ అండ్ మింక్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో గతంలోనే తాము సమావేశం నిర్వహించామని ఆదిశగా పబ్ ఓనర్లే బాధ్యతగా వ్యవహరించాలని గుర్తు చేశారాయన. ఒక వేళ పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే.. వారి వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తమ హెచ్చరిక కేవలం రాడిసన్ బ్లూ ప్లాజా పబ్ కి మాత్రమే పరిమితం కాదు. నిబంధనలు పాటించని అన్ని పబ్బులు బార్లపై నిరంతర దాడులు చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
పామ్ అనే యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వాళ్లకే పబ్‌లోకి అనుమతి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.50వేల రుసుము కడితేనే యాప్‌లో లాగిన్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 3వ తేదీ రాత్రి జరిగిన పార్టీలో వేర్వేరు బృందాలుగా ఏర్పడి దాదాపు 150మంది వరకు పబ్‌కు వచ్చారు. వీళ్లలో ఏ బృందం కొకైన్ తీసుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read
lady Finger Benefits: బెండకాయలు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..
Summer Vacations: భారత్‌లో టాప్ 5 వేసవి టూరిజం డెస్టినేషన్లు ఇవే..
How to Murder Your Husband: “భర్తను ఎలా చంపాలో” నవల రాసింది.. ఏకంగా తానే ఆచరించి చూపించింది?