
74వ మిస్ యూనివర్స్ పోటీలలో మరోసారి భారత్ కు నిరాశే ఎదురైంది. థాయ్ లాండ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నారు. కానీ టాప్ 12లో వెనుదిరిగారు. దీంతో భారత్ కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. ఇక ఈ పోటీల్లో ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు. పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పోటీల సమయంలో థాయ్ లాండ్ అధికారికి, ఈ ముద్దుగుమ్మకు మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ కాగా.. చివరకు థాయ్ లాండ్ అధికారి బహిరంగ క్షమపణ చెప్పారు.
అసలు విషయానికి వస్తే.. మిస్ మెక్సికో ఫాతిమా మిస్ యూనివర్స్ పోటీల్లో ఒక షూట్ కు హాజరుకాలేదు. దీంతో ఆమెను మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ అవమానించారు. తెలివితక్కువ అనే అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫాతిగా గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. మిమ్మల్ని మేము గౌరవించినట్లే మిమ్మల్ని మీరు గౌరవించాలని.. నా దేశ సంస్థతో ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి అంటూ మండిపడింది. వీరిద్దరి వాగ్వాదం.. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ కావడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఫాతిమాతోపాటు మరికొందరు సైతం వేదిక నుంచి వాకౌట్ చేశారు.
ఇక తర్వాత ఆమె బయటకు వచ్చి మీడియా ముందు తన అసహనాన్ని వెళ్ళగక్కారు. ఇక అవమానించిన చోటే ఇప్పుడు విజేతగా నిలిచారు ఫాతిమా. దీంతో ఆమె గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫాతిమా వయసు 25 సంవత్సరాలు. మెక్సికో మోడల్ అయిన ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మిస్ యూనివర్స్ పోటీల్లో.. ఈ ఆధునిక యుగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటీ ? మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మీరు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు..? అని అడగ్గా.. భద్రత, సమాన అవకాశాల విషయంలో ఇప్పటికీ మహిళలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని..ఇప్పుడు అమ్మాయిలు తమ భావాలను ధైర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..