UP Elections: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా..!
RPN Singh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందే కాంగ్రెస్ పార్టీ(Congress)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) పార్టీకి రాజీనామా చేశారు.

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందే కాంగ్రెస్ పార్టీ(Congress)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) పార్టీకి రాజీనామా చేశారు. ఆర్పీఎన్ సింగ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Somia Gandhi)కి సమర్పించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వ్యవహరిస్తున్న ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పీఎన్ సింగ్ మంగళవారం తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు.
మరోవైపు, ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని.. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన కాషాయం కండువా కప్పుకోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Uttar Pradesh Assembly Election 2022) ప్రకటనకు ముందు నుంచే ఆయన పార్టీ వీడతారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. యూపీలో ఆర్పీఎన్ సింగ్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. ఆర్పీఎన్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అతను యూపీలోని పూర్వాంచల్‌లోని పద్రౌనా ప్రాంతానికి చెందిన నేత.
ఆర్‌పిఎన్ సింగ్ 1996, 2002, 2007లో పద్రౌనా అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్పీఎన్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. 2004లో రెండో స్థానంలో నిలిచారు. 2009 లోక్‌సభ ఎన్నికలలో, రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) ఎన్నికలలో విజయం సాధించారు. UPA II ప్రభుత్వ హయాంలో ఉపరితల రవాణా మరియు రోడ్డు శాఖ సహాయ మంత్రిగా, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేష్ పాండే చేతిలో 85,540 వేల ఓట్లతో ఆర్పీఎన్ సింగ్ ఓటమి పాలయ్యారు.
ఈమేరకు ఆర్‌పిఎన్ సింగ్ ట్వీట్ చేస్తూ, ‘ఈ రోజు మొత్తం దేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, నేను నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
आज, जब पूरा राष्ट्र गणतन्त्र दिवस का उत्सव मना रहा है, मैं अपने राजनैतिक जीवन में नया अध्याय आरंभ कर रहा हूँ। जय हिंद
— RPN Singh (@SinghRPN) January 25, 2022
ఇదిలావుంటే, RPN సింగ్ భారతీయ జనతాపార్టీలో చేరిన అనంతరం.. పద్రౌనా అసెంబ్లీ స్థానం నుండి స్వామి ప్రసాద్ మౌర్యపై పోటీ చేయవచ్చని తెలుస్తోంది. RPN సింగ్ 1996 నుండి 2009 వరకు ఉత్తరప్రదేశ్‌లోని పద్రౌనా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కున్వర్ రతన్‌జిత్ నారాయణ్ సింగ్ అలియాస్ RPN సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగారు. పద్రౌనా రాచరిక రాష్ట్రానికి చెందిన ఆర్పీఎన్ సింగ్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అతన్ని అక్కడి రాజా సాహెబ్ అని పిలుస్తారు. ఆయన 1964 ఏప్రిల్ 25న ఢిల్లీలో జన్మించారు. అతను ఖుషీనగర్‌లోని క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. పద్రౌనా సమీపంలోని ఖుషినగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన తర్వాత ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. ఆర్పీఎన్ సింగ్ దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఉన్నారు.తాజాగా ఆయన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలనున్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
Today, at a time, we are celebrating the formation of our great Republic, I begin a new chapter in my political journey. Jai Hind pic.twitter.com/O4jWyL0YDC
— RPN Singh (@SinghRPN) January 25, 2022
Read Also…. Gallantry Award List 2022: ఈసారి 939 మందికి గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం