Hyderabad: ఎన్నికల ప్రచారాస్త్రంగా హలాల్‌ అంశం.. హైదరాబాద్‌లో తెరపైకి తెచ్చిన ఎంఐఎం నేతలు

| Edited By: Srilakshmi C

Nov 22, 2023 | 8:11 AM

యూపీలో హలాల్‌ సర్టిఫైడ్‌ ఉత్పత్తుల తయారీతో పాటు అమ్మకాలను నిషేధిస్తూ యోగి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యోగి ప్రభుత్వ నిర్ణయంపై పలు హలాల్‌ సంస్థలతో పాటు కొన్ని వర్గాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ప్రచారంలో ప్రధానాస్త్రంగా ఎంఐఎం నేతలు హలాల్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. యాకుత్‌పురా మజ్లిస్‌ అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌ మీరాజ్‌ హలాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో..

Hyderabad: ఎన్నికల ప్రచారాస్త్రంగా హలాల్‌ అంశం.. హైదరాబాద్‌లో తెరపైకి తెచ్చిన ఎంఐఎం నేతలు
Halal Issue In Hyderabad
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 22: యూపీలో హలాల్‌ సర్టిఫైడ్‌ ఉత్పత్తుల తయారీతో పాటు అమ్మకాలను నిషేధిస్తూ యోగి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యోగి ప్రభుత్వం నిర్ణయంపై పలు హలాల్‌ సంస్థలతో పాటు కొన్ని వర్గాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ప్రచారంలో ప్రధానాస్త్రంగా ఎంఐఎం నేతలు హలాల్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారు. యాకుత్‌పురా మజ్లిస్‌ అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌ మీరాజ్‌ హలాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిచోటా హలాల్‌ మాంసం దొరుకుతుందని, ఎప్పటికీ, ఎన్నటికీ హలాల్‌ మాంసంపై నిషేధం ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం లేదని అన్నారు. తాము ఎప్పుడూ హలాల్‌ అయిన మాంసాన్నే తింటామని, చివరికి తినే తిండిపైనా ఆంక్షలు పెట్టాలనుకుంటే సాధ్యమయ్యే పనికాదని జాఫర్‌ అన్నారు.

అలాగే కొందరు దొంగచాటుగా ఆ మాంసాన్ని తింటున్నారని, అందులో హైప్రొటీన్‌ ఉంటుందని వారికి తెలుసని పేర్కొన్నారు. కాకపోతే మేం బహిరంగంగా తింటున్నాం, మీరు దొంగచాటుగా తింటున్నారు అదే తేడా అని ఎంఐఎం నేత ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో యూపీ ప్రభుత్వం హలాల్‌ సర్టిఫైడ్‌ ఉత్పత్తులతో పాటు విక్రయాలను కూడా తక్షణమే నిషేధిస్తున్నట్టు తెలిపింది. కేవలం ఎగుమతికి నిర్దేశించిన హలాల్‌ ఉత్పత్తులకే మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. ప్రజల మతపరమైన భావాలను క్యాష్‌ చేసుకునేందుకు కొన్ని సంస్థలు నకిలీ హలాల్‌ సర్టిఫికెట్లతో అమ్మకాలు సాగించాలని చూస్తున్నారని యూపీ ఆహార కమిషనర్‌ కార్యాలయం పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా కొన్ని సంస్థలపై కేసులు కూడా నమోదు చేసింది. ఢిల్లీకి చెందిన జమియత్‌ ఉలామాఏహింద్‌ హలాల్‌ ట్రస్ట్‌, హలాల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు జమియత్‌ ఉలామా మహారాష్త్రపై చర్యలు తీసుకున్నారు. అయితే యూపీలో హలాల్ ఆహార పదార్థాలను నిషేధించడంతో ఇప్పుడు బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా ఈ హలాల్ ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ ఉత్పత్తులతో వచ్చిన డబ్బులతో టెర్రరిస్టులకు నిధులు కూడా సమకూరుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో హలాల్‌ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో ఎన్నికలు దగ్గరికి వచ్చిన తరుణంలో ఎంఐఎం నేతలు ఇక్కడ కూడా ఈ హలాల్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.