తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్‌.. అయ్యప్పని గుర్తు చేసుకున్న కేరళ సీఎం..

|

Apr 06, 2021 | 10:21 PM

Assembly Election 2021: తమిళనాడు,కేరళ,అసోం ,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయ్యప్పస్వామి ఆశీస్సులతో కేరళ ఎన్నికల్లో విజయం తమదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం పినరయి విజయన్‌. తమిళనాడు, కేరళ...

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్‌.. అయ్యప్పని గుర్తు చేసుకున్న కేరళ సీఎం..
Tamilnadu Kerala Puducherry
Follow us on

తమిళనాడు,కేరళ,అసోం ,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయ్యప్పస్వామి ఆశీస్సులతో కేరళ ఎన్నికల్లో విజయం తమదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం పినరయి విజయన్‌. తమిళనాడు, కేరళ , అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాట పోలింగ్‌ రోజు కూడా డీఎంకే , అన్నాడీఎంకే నేతల మధ్య మాటలయుద్దం కొనసాగింది.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని రెండు పార్టీలు ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. తమిళనాడులో సాయంత్రం 6 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. కేరళలో 70 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అసోంలో మాత్రం 82 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. పుదుచ్చేరిలో 79 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. బెంగాల్‌లో మూడో విడతలో 78 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

డీఎంకే ఎంపీ కనిమొళి అందరి కంటే చివరగా ఓటేశారు. కరోనా పాజిటివ్‌ కావడంతో ఆమె పీపీఈ కిట్‌ ధరించి చెన్నైలో ఓటేశారు. పోలింగ్‌ సిబ్బంది కూడా పీపీఈ కిట్లు ధరించారు. ఏప్రిల్‌ 4వ తేదీన కరోనా రావడంతో క్వారంటైన్‌లో ఉన్నారు కనిమొళి.  తమిళనాడులో పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల హింస చెలరేగింది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం బరిలో ఉన్న బోడినాయకనూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ , పన్నీర్‌ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కారును ధ్వంసం చేశారు డీఎంకే కార్యకర్తలు. రవీంద్రనాథ్‌ పోలింగ్‌బూత్‌ లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేశాడని ఆరోపించారు డీఎంకే కార్యకర్తలు. డీఎంకే కార్యకర్తలు, అన్నాడీఎంకే కార్యకర్తలకు మధ్య బోడినాయకనూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

తమిళనాడులో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు . హీరో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటేశారు. ఇక తన కుమార్తెలు శృతి హాసన్‌, అక్షర హాసన్‌లతో వచ్చి ఓటు వేశారు కమల్‌. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు తేయ్​నంపేట్​లో ఓటేశారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్​, కుటుంబతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై చెన్నైలో ఓటేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడిలోని సిలువంపాయంలో ఓటు వేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్​సెల్వంపెరియకుళమ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. ఇక చెన్నైలోని థౌజెండ్‌ లైట్స్‌ ప్రాంతంలోని స్టెల్లా మేరి కాలేజీ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌. ప్రముఖ నటుడు సూర్య కూడా తన ఓటు వేశారు. ఇక తిరువాన్మయూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటువేసేందుకొచ్చిన అజిత్‌ ..అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీల కోసం ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఎగబడటంతో..అందరూ వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇచ్చారు.

మలయాళం సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కూడా ఓటేశారు. ఎర్నాకుళంలో తన ఓటుహక్కు వినియోగంచుకున్నారు మమ్ముట్టి. అటు కేరళలో మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ది చెందిన శ్రీధరన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొన్నేని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

ఇవి కూడా చదవండి: క్రికెటర్ కాకుంటే.. ఉగ్రవాది అయ్యేవాడు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌మొయిన్ అలీపై తస్లీమా ఫైర్…
Thalapathy Vijay Cycles: నటుడు విజయ్ కుమార్‌పై నెటిజన్ల ఫైర్.. వివరణ ఇచ్చుకున్న తలపతి సోషల్ మీడియా సైన్యం