EC on Tamilnadu Election: కరోనా బాధితులకు పోస్టల్ ఓటు.. కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ఈసీ

|

Mar 15, 2021 | 4:00 PM

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి తపాలా ద్వారా ఓటు హక్కు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు తెలిపారు.

EC on Tamilnadu Election: కరోనా బాధితులకు పోస్టల్ ఓటు.. కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ఈసీ
Tamilnadu Ceo Satyabrata Sahoo Releases Postal Ballot Procedures
Follow us on

EC on Tamilnadu elections 2021 : తమిళనాడులో పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన కోవిడ్ బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది.  కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి తపాలా ద్వారా ఓటు హక్కు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు చెప్పారు. శాసనసభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌ 6న జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కోవచ్చని ఎన్నికల కమిషన్‌ వెల్లడించారు.

అదే విధంగా  కోవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకొవచ్చని… అలాగే పోలింగ్‌ రోజున చివరి గంటలో వారు పీపీఈ కిట్‌తో వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కూడా కోవిడ్ నిబంధనలకు అనుగూనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ గాడ్స్ కూడా అందిస్తున్నట్లుగా ఎన్ని కల కమిషన్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధా న ఎన్నికల కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు మాట్లాడుతూ, కరోనా బాధితులు తపాలా ఓటు హక్కు వినియోగించే సౌకర్యం కల్పించామని, ముందుగా పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అదే ఆలోచిస్తున్నామన్న మంత్రి‌ అనురాగ్‌ఠాకూర్
MK Stalin Nomination: జనసంద్రమైన కొల్లాత్తూర్.. కేరింతలు.. హర్షధ్వానాల మధ్య తమిళనేతల నామినేషన్లు..
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు…