తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ సైకిల్ మీద వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్ వేగంగా సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయనను బైక్‌లతో ఫాలో అయ్యారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్ కేంద్రానికి విజయ్ సైకిల్ మీద వచ్చి స్పెసల్ ఆట్రాక్షన్‌గా నిలిచారు.
అయితే హీరో విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్ బిల్డప్ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ కొందరు ట్రోల్స్ చేస్తుంటే… అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలపై నిరసన వ్యక్తం చేసేందుకే ఇలా చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని విమర్శించాలనే ఇలా చేశారని మండిపడుతున్నారు.
అయితే.. విజయ్ సైకిల్ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్ మీడియా సైన్యం వివరణ ఇచ్చుకుంది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది అంటూ పేర్కొంది. పోలింగ్ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉండటం వల్లే ఆయన సైకిల్‌పై వెళ్లారని. అయితే పోలింగ్ బూత్ ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం అంటూ తెలిపింది. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్ సోషల్ మీడియా టీం పేర్కొంది.
Watch: Thalapathy #Vijay cycles to a polling booth in Neelankarai to cast his vote. @IndianExpress @ieEntertainment pic.twitter.com/E2ttzlgWB5
— Janardhan Koushik (@koushiktweets) April 6, 2021