Tamilnadu Elections 2021: నా పేరు ఎంకే. స్టాలిన్.. కరుణానిధి కుమారుడిని.. ఐటీ రైడ్స్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన డీఎంకే చీఫ్
IT Raids - MK Stalin: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఇన్ని రోజులు నేతల మాటల తూటాలతో.. వేడెక్కిన ప్రచారం కాస్తా.. శుక్రవారం ఐటీ రైడ్స్ కలకలం సృష్టించింది. ప్రతిపక్ష
IT Raids – MK Stalin: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఇన్ని రోజులు నేతల మాటల తూటాలతో.. వేడెక్కిన ప్రచారం కాస్తా.. శుక్రవారం ఐటీ రైడ్స్ కలకలం సృష్టించింది. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అయితే.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు మిత్రపక్షమైన బీజేపీ.. ప్రతిపక్ష డీఎంకే నేతలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతుండటంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ, డీఎంకే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తాజాగా కుమార్తె ఇంటిపై ఐటీ అధికారులు దాడుల గురించి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టాలిన్.. బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టలేరంటూ పేర్కొన్నారు. ఐటీ దాడులతో భయపడిపోవడానికి తామేమీ అన్నాడీఎంకే సభ్యులం కాదు. మేము డీఎంకే సభ్యులం. నేను ఎంకే. స్టాలిన్‌ని. మీసాను.. ఎమర్జెన్సీని సైతం తట్టుకున్నాను. ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. నేను కరుణానిధి కుమారుడిని.. భయపడను. అంటూ స్టాలిన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పెరంబులూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ మాట్లాడుతూ.. చెన్నై నుంచి త్రిచీ వచ్చే సమయంలో తన కూతురు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయన్న వార్త తెలిసిందని వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడడానికి మోదీ ప్రయత్నిస్తున్నారంటూ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. చెన్నై శివారులోని నీలాంగరైలో స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంటితో పాటు.. కార్యాలయాల్లోనూ మొత్తం నాలుగు చోట్ల ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Also Read: