అన్నా డీఎంకే, బీజేపీ కూటమి నుంచి తప్పుకున్న నటుడు విజయ్ కాంత్ డీ

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 4:16 PM

తమిళనాడు ఎన్నికల్లో మరో తాజా పరిణామం...అన్నాడీఎంకే, బీజేపీ కూటమి నుంచి నటుడు విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే తప్పుకుంది.

అన్నా డీఎంకే, బీజేపీ కూటమి నుంచి తప్పుకున్న నటుడు విజయ్ కాంత్  డీ
Follow us on

తమిళనాడు ఎన్నికల్లో మరో తాజా పరిణామం…అన్నాడీఎంకే, బీజేపీ కూటమి నుంచి నటుడు విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే తప్పుకుంది. ఈ పార్టీకి, ఈ కూటమికి మధ్య మూడు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే నిరాకరించిన ఫలితంగానే డీఎండీకే వైదొలగినట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ఏఐఎడీఎంకే, బీజేపీ మధ్య  కుదిరిన  ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనుంది.ఇక  సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి, ఆయన డిప్యూటీ… పన్నీర్ సెల్వం బోడినాయకనూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలోని 39 లోక్ సభ స్థానాలకు గాను 38 సీట్లను ఇది కోల్పోయింది. దక్షిణాదిన పాగా వేయాలన్న బీజేపీ తాను  పోటీ చేసిన 5 సీట్ల లోనూ ఓటమి చవి చూసింది. కానీ 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 37 స్థానాలను (44.3 శాతం ఓట్లను) గెలుచుకున్నా ఆ తరువాత డీలా పడిపోయింది. నాడు కేవలం 5.1 శాతం ఓట్లతో విజయ్ కాంత్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

ఇక ఈ ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ..మక్కల్ నీది మయ్యం 154 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలను తమ మిత్ర పక్షాలకు కేటాయించినట్టు ఆయన చెప్పారు. కాగా డీఎంకే- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సీట్ల సర్దుబాటు కింద కాంగ్రెస్ పార్టీకి డీఎంకే 25 సీట్లను కేటాయించింది. ఇక టీటీవీ దినకరన్ పార్టీకి, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం మధ్య పొత్తుకుదిరింది. ఈ మేరకు ఎంఐఎం మూడు సీట్లకు పోటీ చేయనుంది.  అయితే దినకరన్ ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా ప్రకటించగా ఒవైసీ అధికారికంగా  తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Read More :

Taapsee Pannu: తాప్సీ పన్నూకి పెరుగుతున్న మద్దతు… తప్పుచేసి ఉంటే శిక్షకి సిద్ధమంటున్న బ్యూటీ…!!

Hyderabad : తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై కారులో మంటలు వీడియో