Karnataka Elections: బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరికొద్ది గంటల్లో కర్ణాటక అధిష్ఠానాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిపోనుంది. ప్రస్తుతం ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమకు ఎవరి మద్ధతు అవసరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Karnataka Elections: బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy

Updated on: May 13, 2023 | 12:54 PM

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరికొద్ది గంటల్లో కర్ణాటక అధిష్ఠానాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిపోనుంది. ప్రస్తుతం ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమకు ఎవరి మద్ధతు అవసరం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తుండటంతో ఇప్పటికే కాంగ్రేస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పి కొట్టారని పేర్కొన్నారు. శ్రీరాముడ్ని అడ్డుపెట్టుకుని పార్టీని విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలంటూ సూచించారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలు రాజకీయం చేయాలని చూశారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇస్తున్నారన్నారని.. ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాని తెలిపారు. దేశంలో ఇక ఇవే ఫలితాలే రానున్నాయన్నారు. తెలంగాణలోను కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదైన ఒక పార్టీ 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..