రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయని మాజీ ప్రధానమంత్రి,జేడీ(ఎస్) అధిపతి హెచ్‍డీ దేవగౌడ అన్నారు. ఈ తరహాలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీలతో నిరంతరం చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ఎన్నికల బరిలో ఉన్న జనతాదళ్ అభ్యర్థుల తరపున ప్రచారానికి కేసీఆర్ కూడా వస్తారన్నారు.
అయితే దీనికి సంబంధించి మజీ సీఎం కుమారస్వామితో భారత్ రాష్ట్ర సమితీ నేతలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. తాను 42 చోట్ల ప్రచారం నిర్వహిస్తానని.. కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటించిన పంచరత్న పథకాలతో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని వివరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హాసన, మండ్య జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో జనతాదళ్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..