Luizinho Faleiro: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఆ రాష్ట్ర మాజీ సీఎం లుయిజినో ఫలేయిరోకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అనూహ్యంగా ఆయన్ను పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవలు దేశానికి అవసరమని, తమ రాష్ట్ర(పశ్చిమ బెంగాల్) ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తన ట్విట్టర్‌లో తెలిపింది. నవంబర్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫలేయిరో వచ్చే వారం బెంగాల్‌లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
We are extremely pleased to nominate @luizinhofaleiro to the Upper House of the Parliament.
We are confident that his efforts towards serving the nation shall be appreciated widely by our people!
— All India Trinamool Congress (@AITCofficial) November 13, 2021
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌తో పాటు గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గోవా ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడ పర్యటించారు. గోవాలో తదుపరి ప్రభుత్వం తమదేనంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఎంసీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లే నరేంద్ర మోడీ బలపడుతున్నారని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగానే సెప్టెంబర్ 29వ తేదీన ఫలేయిరో కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరారు. ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవిని కూడా టీఎంసీ అప్పగించింది.
Also Read..
Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..