Milind Naik: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. లైంగిక ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా!

గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు భారతీయ జనతా పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై లైంగిక వేధింపుల కేసు మెడకు చుట్టుకుంది.

Milind Naik: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. లైంగిక ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా!
Goa Minister Milind Naik
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:28 PM

Goa minister Milind Naik resigns: గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు భారతీయ జనతా పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై లైంగిక వేధింపుల కేసు మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో ఆయనను తప్పిస్తూ ముఖ్యమంత్రి సావంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే గోవా అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి మిలింద్ నాయక్ లైంగిక వేధింపుల ఆరోపణలతో బుధవారం మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేర గోవా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) బుధవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిగేలా చూసేందుకు మంత్రి నాయక్ రాజీనామా చేసినట్లు సీఎంఓ పేర్కొంది. నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని, దానిని ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు సీఎంఓ ట్వీట్‌లో పేర్కొంది. మిలింద్ నాయక్‌కు లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించడంతో మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

దక్షిణ గోవాలోని మోర్ముగావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని గత మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అంతకుముందు రోజు మంత్రి నాయక్ కేబినెట్ మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఒక మహిళను లైంగికంగా వేధించాడని కాంగ్రెస్ గోవా చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. సీఎం సావంత్ మంత్రిని బర్తరఫ్ చేయాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, గత నెల చివరి వారంలో ఒ మహిళను మంత్రి మిలింద్ నాయక్ మానసికంగా, శారీరకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చోడంకర్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో మంత్రి పేరు బయట పెట్టేందుకు మహిళ విముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. చోడంకర్ నాయక్ పేరు పెట్టడంతో, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సంకల్ప్ అమోన్కర్ కూడా మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు – మంత్రికి మధ్య జరిగిన ఉద్దేశపూర్వక ఆడియో సంభాషణను కూడా అమోంకర్ విడుదల చేశారు. దీంతో ముఖ్యమంంత్రి సావంత్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు న్యాయబద్ధంగా జరిగేందుకు మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మిలింద్ నాయక్ వెల్లడించారు.

Read Also…  Chanakya Niti: పిల్లల భవిష్యత్ తల్లిదండ్రుల అలవాట్లపైనే అంటున్న చాణుక్యుడు.. వీటిని విస్మరించవద్దు అంటూ సూచన

Latest Articles