గోవా(Goa Assembly Election Results) లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు నెలకొంది. తద్వారా అక్కడ హంగ్ తప్పదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ మాత్రం తామే మరోసారి ప్రభుత్వాన్ని చేపడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP), స్వతంత్ర్య అభ్యర్థులందరూ తమకే మద్దతునిస్తున్నారని తెలిపారు. గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ(BJP) అవతరించింది. 40 సీట్లు ఉన్న రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్(Congress)… ఈ ఎన్నికల్లో మాత్రం 12 స్థానాలకు పడిపోయింది. ఇక ఆశ్చర్యకరంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలానే.. పంజాబ్‌లో దుమ్మురేపిన ఆమ్ ఆద్మీ గోవాలో రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. వాస్తవానికి గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా ఫలితాలు మాత్రం బీజేపీకే అనుకూలమయ్యాయి.
BJP will form the government in Goa; We will take MGP and independent candidates with us, says Goa CM and BJP leader Pramod Sawant pic.twitter.com/L7wZLTS5mV
— ANI (@ANI) March 10, 2022
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయగా..కాంగ్రెస్ పార్టీ 37 సీట్లలో, మిత్రపక్షం జీఎఫ్పీ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఆప్ 39 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక స్థానంలో ఇండిపెండెంట్‌కు మద్దతిచ్చింది. టీఎంసీ 26 స్థానాల్లో, ఎంజీపీ 13, ఎన్సీపీ 13, శివసేన 10 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రమోద్ సావంత్ మొత్తం వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అమిత్ పాలేకర్ రంగంలో దిగగా..కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా..6.27 శాతం ఓట్లు చేజిక్కించుకుంది. గతం కంటే ఈసారి పుంజుకోవడంతో కచ్చితంగా సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. హంగ్ ఏర్పడనుందనే సర్వేల నేపధ్యంలో ఆప్ పార్టీ కీలకంగా మారనుంది.
భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది గోవా. దీనికి కొంకణ తీరమని పేరు. వైశాల్యపరంగా దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభాలో నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్ లు గోవా కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు. గోవా రాజధాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లు గోవాలో వ్యాపారం మొదలు పెట్టి అక్కడే మకాం వేశారు. అక్కడే అధికారాన్ని హస్తగతం చేసుకుని 450 ఏళ్ల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకునే వరకు వారి పాలనలోనే ఉంది గోవా. గోవా అంటే చాలు కుర్రకారు క్యూ కట్టే పరిస్థితి. పకృతి సోయగం, చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద ఈ రాష్ట్రం సొంతం.
Also Read
Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!
Akshay Kumar: ఫైటింగ్‌లో ఇరగదీస్తాడు.. కామెడీతో నవ్విస్తాడు.. వైరల్ అవుతున్న అక్షయ్ స్టిల్స్…
Assembly Election Results 2022: అయ్యో పాపం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో డీలా పడ్డ కాంగ్రెస్