Assam Assembly Election 2021: బీజేపీ ఎన్నడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆయన అసోంలోని మర్గెరిటాలో జరిగిన బీజేపీ ప్రచార సభ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీనేత రాహుల్ గాంధీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించే రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. మార్చి 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్‌షా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో అసోం ప్రజలకు తెలుసని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బద్రుద్దీన్ అజ్మల్‌లలో ఎవరు తమ సంక్షేమం కోసం పని చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేయడం తప్పచేసేదేమి ఉండదని ఆరోపించారు. అమిత్ షా పాల్గొన్న ఈ ప్రచారంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ గత ఐదేళ్లలో చొరబాటుదారులను విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు. కాజీ రంగా నేషనల్ పార్క్ వద్ద స్థలాన్ని గత ఐదేళ్లలో చొరబాటుదారులు ఆక్రమించారని, వారిని అక్కడిన నుంచి ఖాళీ చేయించామని అన్నారు. ఐదేళ్ల కిందట తాను బీజేపీ అధ్యక్షుడి హోదాలో అసోంకు వచ్చినప్పుడు అసోంను ఆందోళన రహితంగా, తీవ్రవాద రహితంగా చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు అమిషా వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆందోళనలు, తీవ్రవాదం ఉండవని ఆయన స్పష్టం చేశారు. అసోంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, అభివృద్ధి జరుగుతోందని అన్నారు. మరో ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే చొరబాట్ల సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే తేయాకు తోటల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.
ఎన్నికల్లో టికెట్ లభించలేదని కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ వినూత్న నిరసన, రాజీనామా, శిరోముండనం
మమతా ముఖర్జీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెన్షన్, ఈసీ ఆదేశం, తక్షణమే ఉత్తర్వుల అమలుకు సూచన