అమరావతి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడలు బండ్లయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. ఫలితాల్లో కూటమి భారీ మెజారిటీ సాధించింది. అధికారి పార్టీని చిత్తుగా ఓడించి అఖండ విజయం సొంతం చేసుకుంది. మరోవైపు లోక్‌సభ స్థానాల్లోనూ ఇదే హవా కొసాగించింది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీలు కనీవినని రీతిలో అత్యధిక డిపాజిట్లు సొంతం చేసుకున్నారు. ఒక్క నారా, నందమూరి ఫ్యామిలీలోనే ఏకంగా నలుగురు విజయం సాధించారు.
కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ గెలుపొందారు. అటు నందమూరి ఫ్యామిలీలో హిందూపురం నుంచి బాలకృష్ణ, విశాఖ ఎంపీగా భరత్ ఘన విజయం సాధించారు. చంద్రబాబు కుప్పంలో 1,18,623 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. నారా లోకేష్ మంగళగిరిలో 1,20,101 ఓట్లు, హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణకు 1,07,250 ఓట్లు దక్కాయి.
ఇక విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన భరత్ కూడా అధిక మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు.
దాదాపు కూటమి గెలుపు ఖాయం అవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాకలు గానూ అధికార వైసీపీ కేవలం 13 స్థానాలకే సరిపెట్టుకోగా కూటమి 162 స్థానాల్లో గెలుపు బావుటా ఎగరవేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.