Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే హడావిడి షురూ!

వచ్చే సినీ సంక్రాంతి గురించి ఇప్పటి నుంచే హడావిడి షురూ అయ్యింది. తాజాగా.. వచ్చే ఏడాది 2021 సంక్రాంతికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబులు తల పడనున్నారనే వార్తలు జోరుగా వస్తోన్న తరుణంలో.. ఇప్పుడు ఆ కేటగిరీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా చేరిపోయారు. తాజాగా.. సరిలేరు నీవెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించారు మహేష్. ఇక ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. జేమ్స్ బాండ్ అనే […]

వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే హడావిడి షురూ!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 30, 2020 | 12:15 PM

వచ్చే సినీ సంక్రాంతి గురించి ఇప్పటి నుంచే హడావిడి షురూ అయ్యింది. తాజాగా.. వచ్చే ఏడాది 2021 సంక్రాంతికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబులు తల పడనున్నారనే వార్తలు జోరుగా వస్తోన్న తరుణంలో.. ఇప్పుడు ఆ కేటగిరీలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కూడా చేరిపోయారు.

తాజాగా.. సరిలేరు నీవెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించారు మహేష్. ఇక ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. జేమ్స్ బాండ్ అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో మహేష్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ షూటింగ్ మే, ఆగష్టు నెలల్లో స్టార్ట్ కానుంది. ఇది వచ్చే న్యూ ఇయర్ సంక్రాంతి పోటీ బరిలో నిలుస్తుందని వంశీ తెలిపారు.

అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఏప్రిల్‌లో పూర్తయిపోతుంది. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఈ చిత్రం కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుందని.. ఇదివరకే త్రివిక్రమ్ వెల్లడించారు.

ఇప్పుడు వీరిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ‘2021 సినీ సంక్రాంతి’ బరిలోకి వస్తున్నారట. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఎంత లేదనుకున్నా.. పవన్ మార్చి నుంచి ఫ్రీగానే ఉంటారు. ఈలోపు ఆయనతో సినిమా చేయడానికి డైరెక్టర్ క్రిష్ లైన్‌లో ఉన్నారట. దీంతో ఆయన కూడా సంక్రాంతికే పీఎస్‌పీకే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

అటు మహేష్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీరికి తోడు పవన్ కూడా తోడయ్యారు. దీంతో.. ఫ్యాన్స్ మధ్య వార్ ఎలా ఉంటుందో కానీ.. 2021 సంక్రాంతి రచ్చరచ్చ అయ్యేలా కనిపిస్తోంది.

సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
సమ్మర్ వెకేషన్‌కి అద్భుతమైన ప్లేసెస్ ఇవే..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
భారీ విస్ఫోటనం.. గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఎగిసిపడుతున్న మంటలు..
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మీరు వాడే టూత్ బ్రష్‌ ఎన్ని రోజులకు మారుస్తున్నారు?
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌..
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?