కాంగ్రెస్ నూతన సారథి ఎవరో తేలేది నేడే: సీడబ్ల్యూసీ
నూతన పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ తాత్కాలికంగా ముగిసింది. తిరిగి రాత్రి 8.30గంటలకు మరోసారి సమావేశమవనున్నామని పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి తెలిపారు. ఈరోజు రాత్రి 9గంటల కల్లా నూతన సారథి ఎవరు అన్నది తేలే అవకాశం ఉందన్నారు. అయితే రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలని మరోసారి ఈ సమావేశంలో కోరామని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. కానీ, రాజీనామాపై పట్టువీడని రాహుల్ […]

నూతన పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ తాత్కాలికంగా ముగిసింది. తిరిగి రాత్రి 8.30గంటలకు మరోసారి సమావేశమవనున్నామని పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి తెలిపారు. ఈరోజు రాత్రి 9గంటల కల్లా నూతన సారథి ఎవరు అన్నది తేలే అవకాశం ఉందన్నారు. అయితే రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలని మరోసారి ఈ సమావేశంలో కోరామని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. కానీ, రాజీనామాపై పట్టువీడని రాహుల్ అందుకు నిరాకరించారన్నారు. ప్రభుత్వ సంస్థల్ని అధికార పక్షం నిర్వీర్యం చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీయే పార్టీని ముందుకు నడపగలరని సూర్జేవాలా అభిప్రాయపడ్డారు. కానీ, ఆయన మాత్రం కార్యకర్తలతో కలిసి పోరాడతానని పట్టుబట్టారన్నారు. రాహుల్ రాజీనామా ఇంకా సీడబ్ల్యూసీ పరిశీలనలోనే ఉందని.. ఈరోజు సాయంత్రం దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశమైన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. సారథి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ ఐదు కమిటీలుగా విడిపోయింది. అధ్యక్ష ఎంపిక కమిటీల్లో తాము ఉండటం సబబు కాదని సోనియా పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Adhir Ranjan Chaudhary after Congress Working Committee(CWC) meeting ends: We will meet again at 8.30 pm, it(name of new party chief) is expected to be finalized by 9 pm today itself pic.twitter.com/HC05bFke5v
— ANI (@ANI) August 10, 2019