ఆ చిన్నారి నాటిన మొక్కల్ని చిదిమేస్తే.. ఆమె కంట కన్నీరే..!
కన్నబిడ్డలను ప్రమాదంలో పోగొట్టుకుంటే ఆ తల్లి దు:ఖం ఎలా ఉంటుంది..? కన్నీరుమున్నీరుగా శోకిస్తుంది. విలపించి, విలపించి.. భారమైన మనసులో విషాదాన్ని నింపుకుంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ చిన్నారిది. ఆమె వయసు 9ఏళ్లు. తన చిన్ననాట తాను ప్రేమగా నాటి, పెంచుకున్న మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారినప్పుడు ఆమె ఆనందానికి అంతులేకపోయింది. అయితే ఆ చెట్లను రోడ్ల వెడల్పు కోసం నరికివేశారు అధికారులు. ఇది చూసిన ఆ చిన్నారి వ్యధ ఇంతా అంతా కాదు వెక్కివెక్కి ఏడ్చింది. […]

కన్నబిడ్డలను ప్రమాదంలో పోగొట్టుకుంటే ఆ తల్లి దు:ఖం ఎలా ఉంటుంది..? కన్నీరుమున్నీరుగా శోకిస్తుంది. విలపించి, విలపించి.. భారమైన మనసులో విషాదాన్ని నింపుకుంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ చిన్నారిది. ఆమె వయసు 9ఏళ్లు. తన చిన్ననాట తాను ప్రేమగా నాటి, పెంచుకున్న మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారినప్పుడు ఆమె ఆనందానికి అంతులేకపోయింది. అయితే ఆ చెట్లను రోడ్ల వెడల్పు కోసం నరికివేశారు అధికారులు. ఇది చూసిన ఆ చిన్నారి వ్యధ ఇంతా అంతా కాదు వెక్కివెక్కి ఏడ్చింది. మణిపూర్‌లో జరిగిన ఈ సంఘటన హృదయాలను కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌లోని కక్‌చింగ్ జిల్లాకు చెందిన వాలెంటీనా ఎలంగ్‌బమ్ అనే చిన్నారి స్థానిక స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి ఒకటో తరగతి చదువుతున్న సమయంలో తన ఇంటి సమీపంలో రెండు మొక్కలను నాటింది. అవి కాస్త పెద్దగా మారి చెట్లుగా తయారయ్యాయి. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో రోడ్ల విస్తరణ కోసం ఆ చెట్లను నరికేశారు. అది చూసిన వాలెంటీనా వెక్కి వెక్కి ఏడ్చింది. పడి ఉన్న తన చెట్లను చూస్తుంటే మనసు తట్టుకోలేకపోతుందంటూ ఏడుస్తున్న ఈ చిన్నారిని ఆపడం అక్కడున్న ఎవ్వరివల్ల అవ్వలేదు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దానిపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ స్పందించారు.
‘‘ఆ అమ్మాయి నాటుకునేందుకు కొన్ని మొక్కలను ఇచ్చాం. ఇప్పుడు ఆ బాలికను ‘‘సీఎం గ్రీన్ మణిపూర్ మిషన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నాం. ఆ చిన్నారిని ఫాలో అవ్వండి. ప్రకృతిని కాపాడండి’’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఆమె అతి సున్నిత హృదయానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
She cry for felling down of 2 trees which she planted when she was only in class 1.We rushed at her place and tried to console her providing more saplings. Now She will be the State government,s “Green Ambassador”for C M,s Green Manipur Mission “ let’s follow her, save nature pic.twitter.com/kGuFsDCPYf
— N.Biren Singh (@NBirenSingh) August 7, 2019