Hacking : మరింత దగ్గరగా వచ్చేస్తోన్న సైబర్ నేరాలు, ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి మోసాలు, ఎమ్మెల్యే తల్లి, మహిళానేతకు షాక్.!

|

Jun 06, 2021 | 5:32 PM

'ఫేస్ బుక్' ద్వారా సొమ్మలు కొల్లగొట్టేందుకు హ్యాకర్లు రకరకాల ఎత్తులు వేస్తూ మాయ చేస్తున్నారు...

Hacking : మరింత దగ్గరగా వచ్చేస్తోన్న సైబర్ నేరాలు, ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి మోసాలు, ఎమ్మెల్యే తల్లి, మహిళానేతకు షాక్.!
Jakkampudi Vijayalakshmi
Follow us on

Cyber Crime : YSRCP MLA Jakkampudi raja mother Vijayalakshmi FB Account Hacked : ఆన్ లైన్ నేరాలు రానురాను ప్రజలకు మరింత దగ్గరగా వచ్చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాల ఎత్తులకు పాల్పడుతూ ఆన్ లైన్ ద్వారా అమాయకపు ప్రజల బ్యాంక్ అకౌంట్లు కొల్లగొడుతూ సొమ్ములు స్వాహా చేస్తున్న ఉదంతాలు ప్రతీ రోజూ లెక్కకు మిక్కిలిగా జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు పేద, సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ధనిక.. ఇలా అందరూ వాడే సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ ద్వారా సొమ్మలు కొల్లగొట్టేందుకు హ్యాకర్లు రకరకాల ఎత్తులు వేస్తూ మాయ చేస్తున్నారు. కొద్దో గొప్పో పేరు, పరపతి ఉందనిపించిన ఫేస్ బుక్ అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా, లేదా అవే పేర్లు, ఫొటోలతో నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్ రిక్వస్ట్స్ పంపుతూ డబ్బులడుగుతున్న ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి.

ఇలాంటిదే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వై.సి.పి కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మికి ఎదురైంది. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మెసెంజర్ లో అత్యవసరంగా డబ్బులు కావాలని పలువురికి మెసేజ్ లు పంపిస్తున్నారు.

ఈ విషయం తెలిసి రావడంతో ఆమె తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ ల పై స్పందించి ఎవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేసిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ అభిమానులు, ప్రజలను కోరారు.

Read also : Sharmila : ‘సారూ.. ! చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ : షర్మిల