AP Crime: యువకుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ సస్పెండ్.. ఎస్ఐపై కూడా వేటు..

|

Aug 12, 2021 | 9:32 AM

Constable, SI suspends: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్

AP Crime: యువకుడి మృతికి కారణమైన కానిస్టేబుల్ సస్పెండ్.. ఎస్ఐపై కూడా వేటు..
Crime
Follow us on

Constable, SI suspends: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పిచ్చుక మజ్జి అనే యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ చర్యలు ప్రారంభించారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌ను ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ సస్పెండ్‌ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు.. తూర్పు గోదావరి రాజమహేంద్రవరానికి చెందిన పిచ్చుక మజ్జిపై గతేడాది అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడనే కారణంతో చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే.. అరెస్టు పెండింగ్‌లో ఉందని.. 41 నోటీసు అందజేయాలని అతడిని చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన యువకుడిని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌ రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశారని, డబ్బులు ఇస్తేనే అతనిపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని పేర్కొన్నాడు. దీనికి ఒప్పుకుంటే చాలని.. లేకుంటే గంజాయి అక్రమ రవాణా కేసులు బనాయిస్తానని బెదిరించాడని.. ఆరోపిస్తూ మజ్జి సెల్ఫీ వీడియో తీసి ఇంటి వద్ద ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అయితే.. మజ్జి మరణానికి కారణమైన కానిస్టేబల్‌ శివరామకృష్ణ ప్రసాద్‌, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ సస్పెన్షన్‌ వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అలాంటి వారిని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడబోనని ఎస్పీ హెచ్చరించారు.

Also Read:

Crime News : చదివింది పదో తరగతే.. కానీ పేస్‌బుక్‌లో పండితుడు.. ఫొటోల మార్ఫింగ్‌తో బ్లాక్‌ మెయిలింగ్..

Honey Trap: హనీ ట్రాప్: ఒంటరిగా ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్‌ కావాలంటారు. మెస్మరైజ్‌ చేసేలా మెసేజ్‌.. ఆ తర్వాతే అసలు ఆట.!