Marriage turn as tension : వికారాబాద్ జిల్లా ఘోరి గడ్డ తండాలో అలజడి.. పెళ్ళి కూతురు ఎదుర్కోలు వేడుకలో కత్తిపోట్లు.!

పెళ్లి సంబరాల్లో భాగంగా మద్య సేవించి నృత్యం చేస్తుండగా వివాదం తలెత్తింది..

Marriage turn as tension : వికారాబాద్ జిల్లా ఘోరి గడ్డ తండాలో అలజడి..  పెళ్ళి కూతురు ఎదుర్కోలు వేడుకలో కత్తిపోట్లు.!

Updated on: Jun 03, 2021 | 9:03 AM

Youngman stabs : వికారాబాద్ జిల్లాలో ఓ వివాహ వేడుక యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. పెళ్లి సంబరాల్లో భాగంగా మద్య సేవించి నృత్యం చేస్తుండగా వివాదం తలెత్తింది. ఈ గొడవలో ఓ యువకునిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కుల్కచర్ల మండలం ఘోరి గడ్డ తండాలో జరిగింది. పెళ్లిలో లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలి డీజే పెట్టుకొని మద్యం సేవించి యువకుల డ్యాన్సులు చేయడం షురూ చేశారు. ఈ క్రమంలో మద్యం మత్తులో యువకుల మధ్య గొడవ చెలరేగింది. రాహుల్ అనే యువకుడ్ని సంజయ్ అనే మరో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమవుతోన్న బాధితుడ్ని హుటాహుటీన వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, కత్తిగాయం తీవ్రత అధికంగా ఉండటంతో అటు నుంచి రాహుల్ ను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంజయ్ తో పాటు గొడవకు కారణమైన మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also : YSR Jagananna Colonies: : నేడు వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం.. ప్రారంభించనున్న సీఎం జగన్