Anantha Babu: సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనంతబాబును తరలించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతకు ముందు అనంత బాబును జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. జూన్ 6 వరకు రిమాండ్‌ను విధించారు. ఉదయం అనంత బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో అనంతబాబును కాకినాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించున్నారు.
ప్రస్తుతం మెజిస్ట్రేట్ వద్ద డ్యాక్యుమెంటేషన్ పూర్తికాగానే అనంతబాబును రాజమండ్రి తరలించనున్నారు. ఇదిలా ఉంటే సుబ్రమణ్యం హత్య కేసు విషయమై ఎమ్మెల్సీనే నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. MLCపై సెక్షన్ 302, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇది ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ కాదనీ.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అనంతబాబును రిమాండ్‌కు తరలించనున్న పోలీసులు 14 రోజుల తర్వాత తిరిగి కస్టడీలోకి తీసుకొని హత్యకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారు.
మరిన్ని నేర వార్తల కోసం క్లిక్ చేయండి..