YCP Leader Malla Vijay Prasad Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల విజయప్రసాద్ అరెస్ట్ అయ్యారు. ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ కేసుల్లో ఒడిషా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని అతని నివాసంలో మళ్లాను అరెస్ట్ చేసిన పోలీసులు.. మెజిస్ట్రేట్ అనుమతితో ఒడిషాకు తరలించారు. రాత్రి కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఒడిశాకు తరలించారు.
వెల్ఫేర్ పేరుతో రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ వ్యాపారం చేసే మళ్ల విజయప్రసాద్‌పై ఒడిషాలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. డిపాజిట్ దారులకు చెల్లింపులు జరపకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 2019లో ఆర్ధిక నేరాల కింద కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసులోనే ఇప్పుడు ఒడిషా సీఐడీ పోలీసులు విజయప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మళ్ల విజయప్రసాద్ కు చిట్ ఫండ్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేశారు. అయితే, తమకు చెల్లింపులు జరపడం లేదంటూ కొందరు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రెండేళ్ల కిందటే ఒడిశాలో కేసు నమోదైంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్ ఉన్నారు.