Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎస్‌ఐ భార్య మృతి.. ఎస్‌ఐకి తప్పిన ముప్పు!
పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఎస్‌ఐ భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Road Accident in West Godavari District: తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఎస్‌ఐ భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో సూర్యారావుపేట సీసీఎస్ ఎస్పై సత్యనారాయణ కుటుంబంతో కలిసి అన్నవరం వెళుతుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎస్‌ఐ సత్యనారాయణ భార్య సరోజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. గాయపడ్డ మిగిలిన కుటుంబసభ్యులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also…. Lungs Protect Tips: పొంచి ఉన్న వాయు కాలుష్యం ముప్పు.. మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..