ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా రేషన్ డీలర్ భద్రకాళిగా మారింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ చెలరేగిపోయింది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు చుక్కలు చూపించింది. తూర్పుగోదావరి జిల్లా నడురబడ గ్రామంలో రేషన్ షాపును స్వాధీనం చేసుకోవడానికి రామచంద్రాపురం ఆర్డీవో సింధు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి దుకాణం స్వాధీనం కోసం వచ్చారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కూడా తీసుకున్నారు. కానీ, దుకాణాన్ని స్వాధీనం చేసేందుకు మహిళా రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతి ససేమిరా అంది. ఎంత నచ్చజెప్పినా ఇచ్చేది లేదంటూ ఎదురు దాడికి దిగింది.
చేసేదిలేక ఇంటి గేటు పగలగొట్టాలంటూ ఆర్డీవో సింధు ఆర్డర్ ఇచ్చింది. అంతే రేషన్ డీలర్ జ్యోతి రెచ్చిపోయింది. తన ఇంటి గేటును తీసేందుకు ప్రయత్నించిన అధికారుల కళ్లల్లో కారం కొట్టి రాడ్డుతో అటాక్ చేసింది. తనకు 2025వరకు హక్కుందనేది డీలర్ జ్యోతి వాదన. హైకోర్టు ఆర్డర్‌లో కూడా అదే ఉందని చెబుతోంది. అలా కాదని హైకోర్టు చెప్పుంటే ఆర్డర్ చూపించమని అంటోంది. కేసు పెండింగ్‌లో ఉండగా… నా ఇంటిపై దౌర్జన్యం చేస్తారా? నన్ను చంపేస్తారా? అంటూ డీలర్ జ్యోతి కౌంటర్ అటాక్ చేసింది.
రేషన్ డీలర్ అటాక్‌లో ఇద్దరు మహిళా పోలీసులకు, సచివాలయ ఉద్యోగికి, వాలంటీర్‌కు గాయాలు అయ్యాయి. కళ్లల్లో కారం పడటంతో విలవిల్లాడిపోయారు. డీలర్ జ్యోతి ఎదురు దాడితో ఏం చేయాలో పాలుపోక సతమతమయ్యారు అధికారులు. ఈ-పోస్, వేయింగ్ మిషన్, సరకులు అప్పగించేందుకు డీలర్ జ్యోతి నిరాకరించడంతో చేసేదేమీలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
Also Read..
AP Schools: ఏపీలో మారనున్న ప్రభుత్వ బడుల స్వరూపం.. కొత్త జాతీయ విద్యావిధానం అమలుకు శ్రీకారం