Ahmedabad Hit And Run Case : కార్ల రేసులో నలిగిన ప్రాణం.. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మహిళ మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు..

Ahmedabad Hit And Run Case : అహ్మదాబాద్ శివరంజని క్రాస్‌రోడ్స్ బిమానగర్ సమీపంలోని పుట్‌పాత్‌పై సోమవారం

Ahmedabad Hit And Run Case : కార్ల రేసులో నలిగిన ప్రాణం.. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మహిళ మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు..
Ahmedabad Hit And Run Case

Updated on: Jun 29, 2021 | 6:23 PM

Ahmedabad Hit And Run Case : అహ్మదాబాద్ శివరంజని క్రాస్‌రోడ్స్ బిమానగర్ సమీపంలోని పుట్‌పాత్‌పై సోమవారం రాత్రి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బిమానగర్ సమీపంలోని పుట్‌పాత్‌పై రాత్రిపూట ప్రజలు నిద్రిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కారు వారిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శాంటుబెన్ అనే మహిళ మరణించింది. గాయపడిన ఇతర వ్యక్తులను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి డ్రైవర్ పారిపోయాడు. ఎన్ డివిజన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పోలీసుల విచారణలో ప్రమాదానికి గురైన కారు శైలేష్ రసిక్లాల్ షా అనే వ్యక్తికి చెందినది. అతడు నవరంగపుర నివాసి. 2017 నుంచి 2021 వరకు ఈ కారు 9 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. నిందితుడు ఒక్క పెనాల్టీ కూడా చెల్లించలేదు. ఇప్పటి వరకు అతడు అహ్మదాబాద్ పోలీసులకు రూ .4,800 జరిమానా చెల్లించాలి. సోమావారం రాత్రి 2 కార్ల మధ్య రేసు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో నలుగురు ఉన్నట్లు తెలిసింది. రేసులో కొన్ని కారణాల వల్ల డ్రైవర్ స్టీరింగ్ వీల్‌పై నియంత్రణ కోల్పోయినప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్నారు.

Viral Video: అర్ధరాత్రి ఎద్దు బీభత్సం.. ముసలావిడపై మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

Viral Video: అడవిలో ఉన్న పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాకు చిత్రహింసలు… ( వీడియో )

Viral Video: అర్ధరాత్రి ఎద్దు బీభత్సం.. ముసలావిడపై మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

VIRAL PHOTOS : ప్రపంచంలోని మొట్టమొదటి భూగర్భ హోటల్ ఇదే..! 2 అంతస్తులు భూమిపైనా.. మిగతావన్ని భూమి లోపల..