భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది.. కానీ అతడు ఏంచేసాడంటే..
భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిందో ఇల్లాలు..పెళ్లైన వారం రోజులకే భార్యను వదిలించుకునేందుకు భర్త వేధించటం మొదలుపెట్టాడని,
భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిందో ఇల్లాలు..పెళ్లైన వారం రోజులకే భార్యను వదిలించుకునేందుకు భర్త వేధించటం మొదలుపెట్టాడని, భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసారని ఆరోపిస్తూ అత్తింటి ముందు ఆమె ఆందోళన చేపట్టింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్ బి నగర్ లోని రాక్ టౌన్ కాలనీలో చోటుచేసుకుంది.
కరీంనగర్, భగత్ నగర్ కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్ , పద్మలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉంటున్నాడు. ఇదే ఏడాది జనవరి 8వ తేదీన వారి పెద్ద కుమార్తె తేజస్విని ని..హైదరాబాద్ రాక్ టౌన్ లో నివాసం ఉండే బత్తుల ఏడుకొండలు పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహా సమయంలో అల్లుడుకి కానుకలుగా 20లక్షల వరకు బంగారం, కట్నకానుకలుగా అందచేశారు. ముహూర్తం సమయంలో తన నానమ్మకు ఒంట్లో బాగోలేదని చెప్పి పెళ్లి తంతుని త్వర..త్వరగా ముగించారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు. వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని క్లేవ్ టెక్ సాఫ్ట్ వేర్ సంస్ధలో, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. తేజస్వినీ బీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. పెళ్లైన వారం రోజుల నుంచి అత్తింటి వారి వేధింపులు ప్రారంభమయ్యాయని తేజస్వినీ ఆరోపించింది. భర్త, అత్తమామలు ఆడపడుచు కలిసి వేధించేవారని…. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసి కాపురానికి తీసుకు రాకుండా పుట్టింటి వద్దే వదిలి పెట్టారని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం కావాలని, నా భర్త నాకు కావాలని బాధితురాలు ధర్నాకు దిగింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం, యూఎస్ డాలర్లు.. లెక్క చూస్తే షాకే..