Delhi Metro Rail: మెట్రో రైల్‌లో దారుణం.. డోర్‍లో చీర చిక్కుకుని మహిళ మృతి.. కారణం అదేనా..?

ప్రయాణంలో ఏమరపాటు, సాంకేతిక లోపం ఓ మహిళ నిండు ప్రాణం బలి తీసుకుంది. ఢిల్లీలోని ఇందర్‌లోక్ స్టేషన్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్ లో ఇరుక్కుపోయి ట్రాక్‌పై పడి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

Delhi Metro Rail: మెట్రో రైల్‌లో దారుణం.. డోర్‍లో చీర చిక్కుకుని మహిళ మృతి.. కారణం అదేనా..?
Delhi Metro

Updated on: Dec 17, 2023 | 1:18 PM

ప్రయాణంలో ఏమరపాటు, సాంకేతిక లోపం ఓ మహిళ నిండు ప్రాణం బలి తీసుకుంది. ఢిల్లీలోని ఇందర్‌లోక్ స్టేషన్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్ లో ఇరుక్కుపోయి ట్రాక్‌పై పడి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గురువారం జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన మహిళను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. డిసెంబర్ 16న ఆమె మృతి చెందినట్లు తెలిసింది. ఆమె మెట్రో ఎక్కిందా లేదా దిగిందా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

ఢిల్లీ మెట్రో ఇందర్‌లోక్ స్టేషన్‌లో ఈ ప్రత్యేక కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో డోర్‌లో చీర, జాకెట్‌ ఇరుక్కుపోయి మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో గాయపడిన మహిళ చనిపోయింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 14న ఇంద్రలోక్ మెట్రో స్టేషన్‌లో మహిళ తన కుమారుడితో కలిసి నంగ్లోయ్ నుండి మోహన్ నగర్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇక ప్రమాదానికి గురైన మహిళను రీనా దేవిగా గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె భర్త ఏడేళ్ల క్రితమే చనిపోయాడని, ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని ఆమె బంధువు విక్కీ తెలిపారు.

సెన్సార్ పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన!

ఢిల్లీ మెట్రో డోర్ సెన్సార్ మహిళ దుస్తుల ఉనికిని గుర్తించడంలో విఫలమై ప్రమాదానికి దారితీసిందని ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైలు అనేక మీటర్లు బాధితురాలిని ఈడ్చుకుంటూ వచ్చింది. దాని కారణంగా ఆమె చివరకు పట్టాలపై పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లి న్యూరో సర్జరీలోని ఐసీయూ వార్డులో చేర్చారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

విచారణ చేపట్టిన సీఎంఆర్‌ఎస్‌

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతినిధి అనూజ్ దయాల్ తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 14న ఇంద్రలోక్ మెట్రో స్టేషన్‌లో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఒక మహిళా ప్రయాణికురాలి బట్టలు రైలు తలుపులో ఇరుక్కుపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) విచారణ జరుపుతుందని ఆయన తెలిపారు. తక్కువ సమయంలో నివేదిక సమర్పించాలని సీఎంఆర్‌ఎస్‌ను కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…