Cyber Crime: ఇన్‌స్టాలో ఇష్టమన్నాడు, ప్రేయసికి రూ.కోటి బహుమతి అని చెప్పాడు…. కట్ చేస్తే..!!

|

May 28, 2022 | 7:09 PM

హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ మహిళ(30) కార్పొరేట్‌ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.

Cyber Crime: ఇన్‌స్టాలో ఇష్టమన్నాడు, ప్రేయసికి రూ.కోటి బహుమతి అని చెప్పాడు.... కట్ చేస్తే..!!
Woman Constable
Follow us on

యావత్‌ దునియా మొత్తం ఇంటర్‌నెట్‌ వలయంలో చిక్కుకుంది. విచ్చలవిడి ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. దాంతో పాటుగానే ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా పెరిగాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రకరకాల దారులను వెతుక్కుంటూ ప్రజలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా సంస్థలు, పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా ఓ అందమైన యువతి ఇన్‌స్టా వేదికగా 15లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ మహిళ(30) కార్పొరేట్‌ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. , తాను యూకేలో ఉంటున్నట్లు యువతిని అద్దంగా నమ్మించి స్నేహం చేశాడు. తనకు యూకేలో బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయని బడాయిపోయాడు. అసలు సిసలైన భారతీయ యువతిని పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇంతకాలానికి ఇలాంటి యువతి నాకు దొరికిందని, నువ్వే నాకు సరైన జీవిత భాగస్వామివంటూ ఆశపెట్టాడు. యూకే నుంచి కోటి రూపాయలకుపైగా విలువైన బహుమతులు పంపుతున్నానంటూ ఆమెను బురిడీ కొట్టించాడు.

ఆ తర్వాత రెండు రోజులకు కస్టమ్స్‌ అధికారినంటూ ఓ వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్‌కాల్‌ వచ్చింది. బహుమతులు తీసుకొనేందుకు కస్టమ్స్‌, జీఎస్‌టీ తదితర పన్నుల పేర్లతో విడతల వారీగా రూ.15 లక్షలు వేర్వేరు ఖాతాల్లో జమచేయించుకున్నారు. ఆ తర్వాత తనకు ఎటువంటి బహుమతులు రాలేదు సరికదా, సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్‌ గానీ, మెసేజ్‌ లేని లేకపోవటంతో బాధితురాలు మేల్కోంది. తాను మోసపోయానని గ్రహించింది. ఇంతకాలం కూడబెట్టిన రూ. 15లక్షలు పోవటంతో సైబర్‌పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి