కేరళలో దారుణం.. బ్యాంకు లోపల మహిళ ఆత్మహత్య.. రీజన్ ఇదే..

కేరళలో దారుణం చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అది కూడా ఓ కో ఆపరేటివ్ బ్యాంకు లోపల.

కేరళలో దారుణం.. బ్యాంకు లోపల మహిళ ఆత్మహత్య.. రీజన్ ఇదే..

Edited By:

Updated on: Jun 04, 2020 | 7:53 PM

కేరళలో దారుణం చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అది కూడా ఓ కో ఆపరేటివ్ బ్యాంకు లోపల. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవతి అనే మహిళ.. స్థానిక పుతుకలం సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగినిగా పనిచేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలతో సతమతమవుతోందని సహచరుల ద్వారా తెలిసిందని.. అయితే ఇదే అంశంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా.. ? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.