ఖమ్మం జిల్లాలో కలకలం చెలరేగింది. గార్ల మండలంలోని రైల్వే ట్రాక్‌పై పడివున్న అనుమానాస్పదంగా ఉన్న సంచిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు కాల్ చేసి.. వివరాలు చెప్పారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి చూడగా ఖంగుతిన్నారు. తల, కాళ్లు చేతులు నరికేసి కాలిన స్థితిలో ఉన్న మహిళ మొండం ఈ సంచిలో కనిపించింది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్ కు గురయ్యారు.
హంతకులు ఆమెను వేరే ప్రాంతంలో మర్డర్ చేసి.. శరీర భాగాలు వేరుచేసి దహనం చేసిన తర్వాత మొండాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్పాట్ లో దొరికిన వివరాల ఆధారంగా మృతురాలిని కారేపల్లి మండలం భద్య తండాకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా కారేపల్లిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. మహిళ తల, కాళ్లుచేతుల కోసం గాలింపు కొనసాగుతుంది. అయితే మహిళను ఇంత దారుణంగా చంపడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మృతదేహన్ని తరలించేందుకు అంబులెన్స్ దొరకలేదు.. బైక్‌పైనే 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కుమారుడు