పట్టుమని 15 ఏళ్లు రాకముందే.. మత్తుకు బానిసా?.. గుంటూరు జిల్లా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

|

Mar 11, 2021 | 9:39 PM

విద్యార్థి లోకం తప్పుదారి పడుతోందా... అక్రమార్కులే తీసుకెళ్తున్నారా... ఇందులో తప్పెవరిది... శిక్షించాల్సిందెవర్ని... ఇందులో పేరెంట్స్‌ పాపమెంత... టీచర్స్‌ వాటా ఎంత...

పట్టుమని 15 ఏళ్లు రాకముందే.. మత్తుకు బానిసా?.. గుంటూరు జిల్లా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
ఏపీలో విస్తరిస్తున్న డ్రగ్ మాఫియా
Follow us on

విద్యార్థి లోకం తప్పుదారి పడుతోందా… అక్రమార్కులే తీసుకెళ్తున్నారా… ఇందులో తప్పెవరిది… శిక్షించాల్సిందెవర్ని… ఇందులో పేరెంట్స్‌ పాపమెంత… టీచర్స్‌ వాటా ఎంత… గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

పట్టుమని 15 ఏళ్లు కూడా రాకముందే.. మత్తుకు బానిసవుతోంది బాల్యం. చక్కగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన వాళ్లు… గంజాయి మత్తులో పడి చదువుకు డుమ్మా కొడుతున్నారు. అలాంటి ఇద్దరి విద్యార్థుల గుట్టురట్టైంది. ఈ పిల్లలిద్దరు గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఎక్కడో గోడ చాటున మత్తు పదార్థాలు సేవిస్తుండగా స్థానికులు గుర్తించారు. పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డ స్థానికులు.. ఆపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. వారిని పోలీసులు కదిలించినప్పుడు చెప్పిన సమాధానం మనం వింటే మనమంతా అవాక్కవ్వాల్సిందే. తామే కాదు.. తమతో పాటు చాలా మంది విద్యార్థులు ఇలాగే అంటూ జవాబిచ్చారు.

స్కూల్ విద్యార్థులు చాలా కాలంగా ఇలాంటి వ్యసనాలకు బలైనట్లు తెలుస్తోంది. అయినా ఉపాధ్యాయులు గుర్తించలేకపోవడంతో.. ఆలస్యంగా వెలుగుచూసిందీ ఘటన. తాడేపల్లి ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది గంజాయికి బానిసలుగా మారారు. ఇప్పుడు వీరిని ఏం చేయాలి? నిషేధిత ఉత్ప్రేరకం వాడటం తప్పు అని వీరికి తెలుసా? మరి అది వాడినందుకు ఈ బాల్యాన్ని జైల్‌లో బందీగా మార్చాలా? లేదంటే కౌన్సిలింగ్‌ ఇస్తే.. వీరిలో మార్పు వస్తుందా? అసలీ మత్తును వీరికి అందించింది ఎవరు? పిల్లలు ఈ తరహా వ్యసనాలకు అలవాటుపడ్డా టీచర్స్ గుర్తించలేకపోయారా? వీరిని సక్రమమార్గంలో పెట్టడంలో పేరెంట్స్ విఫలమయ్యారా? మనకు కనిపిస్తున్నది ఒకే ఫొటో అయినా.. ఇది అనేక ప్రశ్నలు సంధిస్తోంది. అంతకు మించిన సవాళ్లు విసురుతోంది. ఏమైపోతుంది బాల్యం, ఎటు వెళ్తోంది మన భవిష్యత్ అన్నదే ఆవేదన. స్కూల్‌ పంపించడం వరకే తల్లిదండ్రులు బాధ్యతగా భావిస్తున్నారు…. స్కూల్‌కు వెళ్లిన తర్వాతే బాధ్యతగా టీచర్స్‌ ఫీల్‌ అవుతున్నారు. మరి మధ్యలో వాళ్లు ఎలాంటి వారితో తిరుగుతున్నారు… ఎలాంటి పనులు చేస్తున్నారు… ఇది గమనించాల్సిన బాధ్యత ఎవరిది…? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం.

Also Read:

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే

మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…