వరకట్న పిశాచికి యువతి బలి.. బైక్ కొనివ్వలేదని హతమార్చిన భర్త

| Edited By: Pardhasaradhi Peri

Sep 05, 2020 | 3:58 PM

ప్రభుత్వ చట్టాలకు పాతర పెడుతూ అబలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో ఏదో మూల మహిళలు దారుణాలకు గురవుతున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరకట్న పిశాచి విరుచుకుపడింది. పెళ్లై ఏడాది కాకముందే ఆ యువతికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అదనపు కట్నంగా ఇస్తానన్న బైక్ కొనివ్వలేదని భార్యను కడతేర్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

వరకట్న పిశాచికి యువతి బలి.. బైక్ కొనివ్వలేదని హతమార్చిన భర్త
Follow us on

ప్రభుత్వ చట్టాలకు పాతర పెడుతూ అబలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో ఏదో మూల మహిళలు దారుణాలకు గురవుతున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరకట్న పిశాచి విరుచుకుపడింది. పెళ్లై ఏడాది కాకముందే ఆ యువతికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. అదనపు కట్నంగా ఇస్తానన్న బైక్ కొనివ్వలేదని భార్యను కడతేర్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

వజ్రకరూరు మండల కేంద్రానికి చెందిన చిక్కన్నయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ (26)ని 11 నెలల క్రితం మండలంలోని నెమళ్ళపల్లికి చెందిన కొట్టం సుబ్బరాయుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నకానుల కింద 6 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. కాగా, పెళ్లి అయినప్పటికీ నుంచి భార్య అంటే సుబ్బరాయునికి పెద్దగా ఇష్టం ఉండేది కాదన్నారు లక్ష్మీ కుటుంబసభ్యలు. దీనికితోడు ఏడు నెలల నుంచి అదనపు కట్నం కింద బైక్‌ కొనివ్వాలంటూ భర్త సుబ్బరాయుడు తన భార్య లక్ష్మీని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో సుబ్బరాయుడుతో పాటు అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప కలిసి లక్ష్మీని మరింత మానసికవ వేధకు గురి చేసేవారని వారు పేర్కొన్నారు.

అయితే లక్ష్మీ తల్లిదండ్రులు మాత్రం కుమార్తెకు సర్దిచెప్పి కాపురానికి పంపేవారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నిద్రపోతున్న భార్య లక్ష్మీని భర్త సుబ్బరాయుడు గొంతునులిమి చంపేశాడని పోలీసులు చెప్పారు. అనంతరం సుబ్బరాయుడు.. లక్ష్మీ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి లక్ష్మీ నిద్రమాత్రలు మింగిందని, పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడన్నారు. లక్ష్మీ తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి చూడగా లక్ష్మి గొంతు, మెడపై గాయాలతో చనిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో మృతురాలి తల్లి రమణమ్మ… అల్లుడు సుబ్బరాయుడు, అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప నలుగురు కలిసి తన కుమార్తెను గొంతు నులిమి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త, అత్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.