AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్‌జీ మోజులో తండ్రి ఖాతా నుంచి రూ.16 లక్షలు స్వాహా

ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్.. తన వైపు అడిక్ట్ చేసుకుంటుంది. ఈ గేమ్ కి దాసోహం అయిన ఓ యువకుడు తండ్రి జేబుకు చిల్లు పెట్టాడు. ఏకంగా రూ.16 లక్షలకు ఎగనామం పెట్టాడు.

పబ్‌జీ మోజులో తండ్రి ఖాతా నుంచి రూ.16 లక్షలు స్వాహా
Balaraju Goud
|

Updated on: Jul 05, 2020 | 4:03 PM

Share

పబ్‌జీ.. 2018లో రిలీజ్ అయిన ఈ వీడియో గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కుర్రకారును ఉర్రూతలుగించే మంచి కిక్ ఉన్న గేమ్. ఇది ఒక్కసారి ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్.. తన వైపు అడిక్ట్ చేసుకుంటుంది. ఈ గేమ్ కి దాసోహం అయిన ఓ యువకుడు తండ్రి జేబుకు చిల్లు పెట్టాడు. ఏకంగా రూ.16 లక్షలకు ఎగనామం పెట్టాడు.

పంజాబ్‌‌ రాష్ట్రంలోని ఖరర్‌‌లో ఉంటున్న ఓ టీనేజర్(17) పబ్‌జీ.. గేమ్ మోజు పుట్టింది. కేవలం తన కోసమే కాకుండా తన టీమ్‌ ‌కోసం యాప్‌ పర్చేజ్‌‌లు చేయాలనుకున్నాడు. ఇందుకు డబ్బులు కావల్సి వచ్చి తండ్రి అకౌంట్ ను తస్కరించాడు. తండ్రి పొదుపు మొత్తాన్నంతా ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేశాడు. తమ బ్యాంక్‌‌ స్టేట్‌‌మెంట్ ‌చూశాక కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియలేదు. తన తల్లి మొబైల్‌‌ నుంచే ఈ ట్రాన్సాక్షన్లు చేశాడని గుర్తించారు. డబ్బులు తీసిన ప్రతిసారి బ్యాంక్‌ ‌మెసేజ్‌‌లను ఎప్పటికప్పుడు డిలీట్‌‌ చేసేవాడని యువకుడి తండ్రి తెలిపారు. ఎప్పుడూ ఫోన్‌‌ పట్టుకొని ఉంటే ఆన్‌‌లైన్‌ ‌స్టడీ కోసం వింటున్నాడని అనుకున్నామని ఆయన వాపోయారు. తాజాగా తమ బాబును చదువు మాన్పించి ఒక రిపేర్‌ షాప్‌‌లో పనికిపెట్టామని తెలిపారు. సో తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండీ..! లాక్ డౌన్ లో ఇంటికి పరిమితమైన పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి.

Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం