ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఇద్ద‌రు యువ‌తులు మృతి

|

Dec 24, 2020 | 1:42 PM

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రోడ్డు గురువారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌తుల‌ను క్వారీ లారీ అతి వేగంగా ...

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఇద్ద‌రు యువ‌తులు మృతి
Follow us on

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రోడ్డు గురువారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌తుల‌ను క్వారీ లారీ అతి వేగంగా ఢీకొట్ట‌డంతో వారిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స్కూటీని లారీ వేగంగా ఢీకొట్టి వారిపై నుంచి వెళ్లిపోవ‌డంతో ఇద్ద‌రు యువతుల శ‌రీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.

విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృతి చెందిన యువ‌తులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గ‌వి, త‌నూష‌లుగా గుర్తించారు పోలీసులు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.