West Godavari District Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలవుతున్నారు. ప్రమాదాలు జరుగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దెందులూరు సమీపంలోని జాతీయ రహదారిపై బస్సును కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Boinpally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్