Road Accident: కొంపముంచిన పొగమంచు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. మహిళతో సహా ముగ్గురు మృతి

|

Jan 23, 2022 | 2:48 PM

పశ్చిమ బెంగాల్‌లోని పాండవేశ్వర్‌లో మారుతీ వ్యాన్, డంపర్ ఢీకొన్న ప్రమాదంలో మహిళతో సహా ముగ్గురు మృతి చెందారు.

Road Accident: కొంపముంచిన పొగమంచు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. మహిళతో సహా ముగ్గురు మృతి
Road Accident
Follow us on

West Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని పాండవేశ్వర్‌లో మారుతీ వ్యాన్, డంపర్ ఢీకొన్న ప్రమాదంలో మహిళతో సహా ముగ్గురు మృతి చెందారు. వెస్ట్ బుర్ద్వాన్ జిల్లాలోని పాండ్వేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుతాదిహ్ మోర్ సమీపంలో NH 60పై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో మృదులా దాస్ (42), సిద్ధార్థ రాయ్ (35), సుదీప్త బారుయ్ (32) ఉన్నారు. మృతులంతా సలాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసులు. వీరంతా వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సియురికి వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కారులో దాదాపు 10 మంది ఉన్నారు. తిరుగు ప్రయాణంలో పొగమంచు కారణంగా వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.

పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలోని పాండబేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోటాదిహి కొల్లేరీకి ఆనుకుని ఉన్న జాతీయ రహదారి నంబర్ 60లోని ఇటుక బట్టీ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం, మారుతీ వ్యాన్ నిలబడి ఉన్న డంపర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు, వర్షం కారణంగా రోడ్డు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీర్‌భూమ్‌లోని సూరిలో జరిగిన పెళ్లికి వెళ్లిన ప్రయాణికులు పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలోని రూపనారాయణపూర్‌కు తిరిగి వస్తున్నారు.

ఈ ప్రమాదంలో మారుతీ కారు డ్రైవర్‌ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని మృదులా దాస్, సిద్ధార్థ్ రాయ్‌గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను దుర్గాపూర్ సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సబ్ డివిజనల్ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. ప్రమాద ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదిలావుంటే, ఈరోజు హౌరాలోని సలాకియాలో ఓ ప్రైవేట్ కారు వ్యక్తిని వెనుక నుంచి తోసేసింది. ఈ ఘటన సీటీటీవీ కెమెరాలో రికార్డైంది. ఉదయం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also….  Lockdown: కేరళలో కొనసాగుతున్న లాక్‌డౌన్.. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి!