బెదిరింపులు.. సెటిల్మెంట్లు.. ఒక్కటేమిటీ.. అమ్మో..! సచిన్‌ వాజే మాములోడు కాదుగా..!

|

Apr 09, 2021 | 9:03 PM

సస్పెండైన ముంబై మాజీ పోలీసు అధికారి సచన్‌వాజేకు ఈనెల 23 వరకు జ్యడిషియల్‌ కస్టడీ విధించింది ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. వసూళ్ల కేసులో ముంబై బార్ల యాజమానులను సీబీఐ విచారించింది. బీఎంసీ ఈ టెండరింగ్‌ కేసులో వాజే కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

బెదిరింపులు.. సెటిల్మెంట్లు.. ఒక్కటేమిటీ.. అమ్మో..! సచిన్‌ వాజే మాములోడు కాదుగా..!
Waze Prime Accused
Follow us on

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాల కారు పెట్టిన సచిన్‌ వాజే మాములోడు కాదు. ఎన్‌ఐఏ విచారణతో పాటు సీబీఐ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు లోకి వస్తున్నాయి. అంబానీని బెదిరించడమే కాదు ఇలాంటి కుట్రలు వాజే మరిన్ని చేసినట్టు వెల్లడయ్యింది.

కోట్లాది రూపాయల బీఎంసీ ఈ టెండరింగ్‌ స్కామ్‌ సెటిల్మెంట్లో సచిన్‌వాజే తలదూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు తాజాగా ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖను జాన్‌ మిషెల్‌ డీకొస్టా అనే వ్యక్తి ముంబయి పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలే, బీఎంసీ కమిషనర్‌ ఇక్బాట్‌ చాహల్‌కు రాశారు.

ఈ టెండరింగ్‌ స్కామ్‌ సెటిల్మెంట్‌పై దర్యాప్తు జరపాలని ఈ లేఖలో డిమాండ్‌ చేశారు. రూ.500 కోట్ల విలువైన ఈ టెండరింగ్ కుంభకోణాన్ని సచిన్‌ వాజే దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆయన సెటిల్మెంట్‌ చేశారని ఈ లేఖలో పేర్కొన్నారు. వాజేను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత ఈ లేఖ వచ్చింది. బీఎంసీ ఆన్‌లైన్‌ టెండర్ల వ్యవస్థను కొందరు కాంట్రాక్టర్ల ముఠా హ్యాక్‌ చేయించిందని ఫిబ్రవరిలో ఆరోపణలు వచ్చాయి.

ముఠాలోని సభ్యులు అత్యల్ప మొత్తానికి దాఖలైన బిడ్లను కనుక్కొని వాటి కంటే తక్కువ మొత్తానికి బిడ్లు దాఖలు చేశారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టులు దక్కించుకొన్నారు. సచిన్‌ వాజేకు తాజాగా ఎన్‌ఐఏ కోర్టు ఏప్రిల్‌ 23 వరకు జ్యుడిషయల్‌ కస్టడీ విధించింది.

సస్పెండైన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాల కేసుతో పాటు మన్సూక్‌ హీరెన్‌ మర్డర్‌ కేసులో కూడా బుక్కయ్యాడు. మార్చి 13న ఎన్‌ఐఏ సచిన్‌వాజేను అరెస్ట్‌ చేసింది. వాజే దగ్గర నుంచి ఐదు ఎస్‌యూవీలను ఇప్పటివరకు ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

మరోవైపు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ వసూళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ముంబై లోని బార్ల యాజమానులను విచారించింది. బార్లు , రెస్టారెంట్లు , పబ్‌ల నుంచి 100 కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ తనకు టార్గెట్‌ పెట్టారని ఆరోపించారు సచిన్‌వాజే.

ఇవి కూడా చదవండి: IPL 2021: ఐపిఎల్ 2021 చూసేముందు ఈ వార్తను చదవండి.. సిక్సులు, ఫోర్లు, సెంచరీలు ఇవన్నీ మీకోసం..

MI vs RCB Live Score IPL 2021: ఐపీఎల్ సమరంలో తొలి విజయం నీదా..! నాదా..! సై అంటున్న కొదమ సింహాలు..